45 Thousand Jobs: 11 నెలల్లోనే 45 వేల ఉద్యోగాలు.. కులగణనపై మంత్రి సంచలన ప్రకటన
నెహ్రూ ఐఐటి, ఎయిమ్స్, విద్యాలయాలు, సాంకేతిక రంగంలో అభివృద్ధి చేయడం వల్లనే నేడు దేశం ముందుకు వెళుతుంది. నేడు ఫేక్ ప్రచారంతో జరుగుతున్న సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
- By Gopichand Published Date - 03:24 PM, Fri - 15 November 24
45 Thousand Jobs: సిద్దిపేట పట్టణంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ వారోత్సవాలకు ముఖ్యఅతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ప్రభుత్వంలోకి వచ్చిన 11 నెలల్లోనే 45 వేల ఉద్యోగాలు (45 Thousand Jobs) ఇచ్చినట్లు చెప్పారు. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
మంత్రి మాట్లాడుతూ.. గ్రంథాలయ వారోత్సవాలను వారం రోజుల పాటు జరుపుతున్నాం. గ్రంథాలయాలు నిరుద్యోగ యువతకు చదువుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఈరోజు ఎంప్లాయిమెంట్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. 11నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం 45వేల ఉద్యోగాలు ఇచ్చాం. చదివిన జ్ఞానం జీవితంలో ఏదో చోట ఉపయోగపడుతుంది. సిద్దిపేట గ్రంథాలయం రాష్ట్ర గ్రంథాలయాలకు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు.
Also Read: AP Assembly Sessions : జగన్ ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని నాశనం చేసాడు – సీఎం చంద్రబాబు
నెహ్రూ ఐఐటి, ఎయిమ్స్, విద్యాలయాలు, సాంకేతిక రంగంలో అభివృద్ధి చేయడం వల్లనే నేడు దేశం ముందుకు వెళుతుంది. నేడు ఫేక్ ప్రచారంతో జరుగుతున్న సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సర్వేలో ఎలాంటి బ్యాంక్ వివరాలు అడగడం లేదు. 87వేల ఎన్యుమారెట్ లను పెట్టి సర్వే జరిపిస్తున్నామన్నారు. ఇప్పటికే 30శాతం పూర్తి అయ్యింది. సర్వే వల్ల ఎలాంటి నష్టం జరగదు. దేశానికి దిక్సూచిగా సర్వే నిలబడుతుంది. సర్వే కావాలని కోరిన వారే నేడు కనబడడం లేదు. సర్వేను అడ్డుకున్న వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. అందరికీ గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు అని ముగించారు.