Minister Ponnam Prabhakar
-
#Telangana
ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క
కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడా అనుసంధానిస్తూ, ఏఐ ప్రమాణాలకు ‘మార్గదర్శక శక్తి’గా నిలుస్తోంది” అని ఆయన అన్నారు. “ది మెరిడియన్ […]
Date : 08-07-2026 - 3:24 IST -
#Telangana
Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్
అర్హత ఉన్న వారు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 48 గంటల్లోనే కార్డు జారీ చేసే విధంగా వ్యవస్థను సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, పారదర్శకంగా మరియు వేగవంతంగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
Date : 05-07-2026 - 2:26 IST -
#Telangana
Ponnam prabhakar: పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాకే సభ పెట్టుకోవాలి: మంత్రి పొన్నం ఆగ్రహం
హైదరాబాద్‌లో జనసేన అధినేత, ఏపీ పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన ‘నవనిర్మాణ సభ’పై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ సభ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును గతంలో పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారని మంత్రి పొన్నం గుర్తుచేశారు. […]
Date : 01-06-2026 - 3:02 IST -
#Telangana
Glass Bridge: తెలంగాణలో తొలి గ్లాస్ హార్ట్ సింబల్‌లా బ్రిడ్జి..
తెలంగాణలో పర్యాటక రంగం కొత్త సొబగులు అద్దుకుంటోంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జి (గాజు వంతెన) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వేగంగా రూపుదిద్దుకుంటోంది. కాకతీయుల కాలం నాటి చారిత్రక ఎల్లమ్మ చెరువులో ఈ గాజు వంతెనను నిర్మిస్తుండటం విశేషం. పర్యాటకులను ఆకర్షించేందుకు దీనిని హృదయాకారంలో (లవ్ సింబల్) డిజైన్ చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో చేపట్టిన చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా ఈ వంతెనను ఏర్పాటు చేస్తున్నారు. […]
Date : 22-05-2026 - 8:49 IST -
#Telangana
Telangana: స్టార్ హోటళ్లలోనూ అందుబాటులోకి తాటి కల్లు : మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
ponnam prabhakar తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైన గీత వృత్తికి, తాటి ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాటి కల్లు, నీరాను కేవలం పానీయాలుగా కాకుండా ప్రకృతి ప్రసాదించిన ఔషధాలుగా ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోందని అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాటి కల్లుపై సమాజంలో […]
Date : 15-05-2026 - 11:41 IST -
#Telangana
RTC: ఆర్టీసీ సమ్మె విరమించండి.. పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి..
Ponnam Prabhakar తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్‌టీసీ) ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని, ప్రజా సంస్థను కాపాడుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలన చేస్తోందని, నాలుగు వారాల్లో నివేదిక వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. సంస్థను, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని […]
Date : 22-04-2026 - 12:58 IST -
#Telangana
Strike Siren : సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం రిక్వెస్ట్
ఆర్టీసీ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, అది లక్షలాది మంది సామాన్యుల జీవనరేఖ అని మంత్రి అభివర్ణించారు. సంస్థను లాభాల బాటలో నడిపించడంలో మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఉద్యోగుల కృషి మరువలేనిదని కొనియాడారు
Date : 14-04-2026 - 12:50 IST -
#Telangana
Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా
Jeevan Reddy Resigns from Congress Party కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని, గౌరవం లేని చోట ఉండలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన ఆవేదన […]
Date : 25-03-2026 - 2:58 IST -
#Speed News
బీఆర్ఎస్ హయాంలో అవినీతిని కవితనే బయట పెట్టారు -పొన్నం ప్రభాకర్ సంచలనం
బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎంతో అవినీతి జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు, ఆమె చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణిపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిపై బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు కవిత ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు […]
Date : 21-01-2026 - 3:39 IST -
#Telangana
Ponnam Prabhakar : రేషన్ కార్డు ఉంటే మీ ఇంటికే చీర.. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు కాంగ్రెస్ గవర్నమెంట్ గుడ్ న్యూస్!
తెలంగాణలో మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కోహెడలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీని ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందించి, వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని ఆయన ప్రకటించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఇస్తున్నామని తెలిపారు. త్వరలో ప్రతి మండలానికి క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.అయితే.. క్షేత్ర స్థాయిలో మహిళా సంఘాల సభ్యులకే చీరలు ఇస్తుండటం వలన.. రేషన్ […]
Date : 24-11-2025 - 4:33 IST -
#Telangana
Minister Ponnam Prabhakar : అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు మంత్రి పొన్నం లేఖ
రాజకీయ పరంగా కీలకమైన ఈ ఆహ్వానం, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి ప్రభుత్వ వైఖరిని వివరించేందుకు గవర్నర్‌తో భేటీ కావడమే లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్‌ను సందర్శించారు.
Date : 31-08-2025 - 4:32 IST -
#Telangana
Congress : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అజారుద్దీన్ పోటీచేస్తారా?.. మంత్రుల ప్రకటనలు, అభ్యర్థుల ఆశలు
మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. పార్టీ హైకమాండ్ అభ్యర్థిని నిర్ణయిస్తుందని స్పష్టం చేసిన మంత్రి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి స్థానిక నేతకే టికెట్ దక్కుతుందని అన్నారు.
Date : 29-07-2025 - 2:07 IST -
#Telangana
Minister Ponnam Prabhakar : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమే: మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రామచందర్‌రావు మరోసారి తన అసలైన రంగును బయటపెట్టుకున్నారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చడం సాధ్యం కాదని వ్యాఖ్యానించడం ద్వారా ఆయన బీసీలను తక్కువచేసే ప్రయత్నం చేస్తున్నారు.
Date : 22-07-2025 - 11:27 IST -
#Devotional
Balkampet Yellamma : వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. అమ్మవారికి పట్టు వస్త్రాలు
మొదటి రోజు ‘పెళ్లికూతురు ఎదుర్కొళ్ల’, రెండో రోజు ‘అమ్మవారి కల్యాణం’, మూడో రోజు ‘రథోత్సవం’ నిర్వహించనున్నారు. కల్యాణోత్సవం సందర్బంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా సనత్‌నగర్, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్ పరిధిలోని ముఖ్య మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Date : 01-07-2025 - 12:29 IST -
#Devotional
Telangana : బోనాల ఉత్సవాలకు రూ.20కోట్లు మంజూరు: మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ నిధులు నగరంలోని మొత్తం 2,783 ఆలయాలకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు, అవసరమైన ఏర్పాట్లకు చెక్కుల రూపంలో విడుదల చేసినట్టు మంత్రి వివరించారు. దేవాలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రతి ఆలయంలో ఉత్సవాలు విజయవంతంగా జరగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
Date : 25-06-2025 - 5:55 IST