HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Social Media Creators Hard Work Is Being Exploited Vijayasai Reddy

సోషల్ మీడియా క్రియేటర్ల శ్రమను దోచుకుంటున్నారు: విజయసాయిరెడ్డి

  • Author : Vamsi Chowdary Korata Date : 03-03-2026 - 4:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayasai Reddy
Vijayasai Reddy

Vijayasai Reddy  సోషల్ మీడియా వేదికలపై రాత్రింబవళ్లు శ్రమించి కంటెంట్‌ను సృష్టిస్తున్న భారతీయ క్రియేటర్లకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కడం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారతీయుల ప్రతిభను తక్కువ ధరకు వాడుకుంటూ, ప్రకటనల ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని తమ జేబుల్లో వేసుకుంటున్నాయని మండిపడ్డారు.

యూట్యూబ్ వంటి సంస్థలు ప్రకటనల ఆదాయంలో 55 శాతం క్రియేటర్లకు ఇస్తుండగా, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు క్రియేటర్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. విదేశీ సంస్థలు తమ ధోరణిని మార్చుకోని పక్షంలో, భారతదేశానికే సొంతంగా ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఉండాలని ఆయన ప్రతిపాదించారు. ‘భారత్ టాక్సీ’ లాంటి స్వదేశీ ప్రత్యామ్నాయాల మాదిరి, ఒక స్వదేశీ సోషల్ మీడియా యాప్ ఉంటే మన దేశ సంపద విదేశాలకు పోకుండా ఉండటమే కాకుండా, క్రియేటర్లకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ సమస్యపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తక్షణమే జోక్యం చేసుకోవాలని విజయసాయి రెడ్డి కోరారు. గతంలో అశ్వినీ వైష్ణవ్ క్రియేటర్ల పక్షాన మాట్లాడిన విషయాన్ని గుర్తుచేస్తూ, వారి ఆర్థిక భద్రత, హక్కుల కోసం కఠినమైన చట్టబద్ధ నిబంధనలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

భారతీయ క్రియేటర్ల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వ రంగంలో లేదా స్వదేశీ భాగస్వామ్యంతో కొత్త ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఇండియాలో క్రియేటర్లే వెన్నెముక అని, వారి హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ashwini Vaishnaw
  • Creators Rights
  • Digital India
  • Former MP Vijayasai Reddy
  • Indian Creators
  • Indian Social Media App
  • instagram
  • MP Vijayasai reddy
  • social media platforms
  • youtube

Related News

    Latest News

    • సోషల్ మీడియా క్రియేటర్ల శ్రమను దోచుకుంటున్నారు: విజయసాయిరెడ్డి

    • Mini Maldives : తెలంగాణలో మినీ మాల్దీవులు ఉన్నాయని మీకు తెలుసా ?

    • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలి.. చైనా వార్నింగ్ !

    • ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్‌చిట్.. తిరుమల పర్యటన తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు : కల్వకుంట్ల కవిత

    • యుద్ధం ఎఫెక్ట్ : ఇండియా లో ఏ ఏ వస్తువులకు ధరలు పెరగబోతున్నాయో తెలుసా ?

    Trending News

      • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

      • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

      • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

      • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

      • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd