T Congress Incharge : టీ కాంగ్రెస్‌కు కొత్త ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ? రేసులో ఆ ముగ్గురు !
ఏఐసీసీ కొత్త ఇన్‌ఛార్జి(T Congress Incharge) నియామకం జరిగిన తర్వాతే టీపీసీసీ కార్యవర్గం కూర్పు జరుగుతుందా ? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
- By Pasha Published Date - 05:02 PM, Wed - 1 January 25

T Congress Incharge : ఇయర్ 2025లో తెలంగాణ కాంగ్రెస్ కొంగొత్త మార్పులను చూసే అవకాశం ఉంది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే ఏఐసీసీ ఇన్‌ఛార్జిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ కీలకమైన పార్టీ పదవిలో దీపాదాస్ మున్షీ ఉన్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆమె స్థానంలో మరో సీనియర్ నేతను ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది.
Also Read :New Pamban Bridge : పాంబన్ వంతెన రెడీ.. బోల్టు నుంచి లిఫ్ట్ దాకా అబ్బురపరిచే విశేషాలు
ఈ పదవి కోసం కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో ఉన్న నేతల జాబితాలో.. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఉన్నారట. అయితే వీరిలో ఎవరికి తెలంగాణ వ్యవహారాలను కాంగ్రెస్ పెద్దలు అప్పగిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బఘేల్, గెహ్లాట్, జైరాం రమేశ్‌లలో ఎవరి వైపు సీఎం రేవంత్ మొగ్గు చూపుతారో వారికే ఈ పదవి దక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. పార్టీలోని ఇతర సీనియర్ల అభిప్రాయాలను కూడా హైకమాండ్ తీసుకోనుంది. సంక్రాంతి పండుగ తర్వాత ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త పీసీసీ చీఫ్ నియామకం జరిగి వంద రోజులు గడిచిపోయాయి. అయినా నేటికీ టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు కాలేదు. ఇలా ఎందుకు జాప్యం జరుగుతోంది ? ఏఐసీసీ కొత్త ఇన్‌ఛార్జి(T Congress Incharge) నియామకం జరిగిన తర్వాతే టీపీసీసీ కార్యవర్గం కూర్పు జరుగుతుందా ? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
Also Read :Most Used Platform : సైబర్ క్రైమ్స్‌కు ఎక్కువగా వాడుతున్నది ఆ యాప్‌నే.. కేంద్రం నివేదిక
కేరళ ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న దీపాదాస్ మున్షీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర చీఫ్ అబ్జర్వర్‌గా వ్యవహరించారు. లోక్‌సభ ఎన్నికల టైంలో కేరళతో పాటు ఆమెకు తెలంగాణ ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరికల అంశంపై దీపాదాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు విమర్శిస్తున్నారు. సీనియర్ నేతలకు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల కేటాయింపు విషయంలో దీపాదాస్ నిర్ణయాలు సరిగ్గా లేవని పలువురు మాజీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.