HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >South
  • >New Pamban Bridge A Modern Engineering Marvel Ready For Operations

New Pamban Bridge : పాంబన్ వంతెన రెడీ.. బోల్టు నుంచి లిఫ్ట్ దాకా అబ్బురపరిచే విశేషాలు

ఈ వంతెనపై 600 మీటర్ల పరిధిలో భారీ సైజు వర్టికల్‌ లిఫ్ట్‌(New Pamban Bridge) ఉంది. దాని ఏర్పాటు పనులు పూర్తి కావడానికే 5 నెలల టైం పట్టింది.

  • By Pasha Published Date - 03:29 PM, Wed - 1 January 25
  • daily-hunt
New Pamban Bridge Railway Sea Bridge Tamil Nadu Rameswaram Island 2025 

New Pamban Bridge : తమిళనాడులోని రామేశ్వరం జిల్లా మండపం పట్టణం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవికి వెళ్లాలంటే సముద్ర మార్గం మాత్రమే ఉంది.  ఈ రెండు ప్రాంతాలను సముద్ర మార్గంలో లింక్ చేసేలా పాంబన్ రైల్వే వంతెన రెడీ అయింది. అవసరాన్ని బట్టి నిలువునా పైకి లేపే వసతి కలిగిన ఫ్లెక్సిబుల్ వంతెన ఇది.  మన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ వంతెన ఇది. దీన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పాంబన్ వంతెన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Most Used Platform : సైబర్ క్రైమ్స్‌కు ఎక్కువగా వాడుతున్నది ఆ యాప్‌నే.. కేంద్రం నివేదిక

పాంబన్ వంతెన గురించి..

  • పాంబన్‌ వంతెన పనులకు 2019 మార్చి 1న ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.
  • 2020లో రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) ఈ వంతెన పనులు మొదలుపెట్టి.. నాలుగేళ్లలోనే పూర్తిచేసింది.
  • ఈ వంతెన నిర్మాణంలో ఎక్కడా 1 మిల్లీమీటరు తేడా కూడా రాకుండా రైల్వేశాఖ జాగ్రత్తలు తీసుకుంది.
  • ఈ వంతెనపై 600 మీటర్ల పరిధిలో భారీ సైజు వర్టికల్‌ లిఫ్ట్‌(New Pamban Bridge) ఉంది. దాని ఏర్పాటు పనులు పూర్తి కావడానికే 5 నెలల టైం పట్టింది.
  • వర్టికల్ లిఫ్ట్  బరువు 660 టన్నులు. దీని పొడవు  72.5 మీటర్లు.
  • పాంబన్ వంతెన సముద్రంలో 2.08 కి.మీ పొడవునా విస్తరించి ఉంటుంది. దీని దిగువ నుంచి ఓడలు రాకపోకలు సాగించొచ్చు.
  • ఈ వంతెెనకు రెండు వైపులా నిలువు స్తంభాలు ఉంటాయి. వాటికి 320 టన్నుల బరువున్న దూలాలు వేలాడుతూ ఉంటాయి. రెండు దూలాల బరువు 625 టన్నులు.
  • పాంబన్ వంతెనపై ఉండే వర్టికల్ లిఫ్ట్‌లో సుమారు 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్‌ అవసరం. మిగతా భారాన్ని కౌంటర్‌ వెయిట్‌లు కంట్రోల్ చేస్తాయి.
  • ఈ వంతెనను ఎత్తాల్సి వచ్చినప్పుడు కింద లిఫ్ట్‌లు, మోటార్ల సాయంతో అవలీలగా పైకి వస్తుంది. రిమోట్ కంట్రోల్‌ ద్వారా ఇదంతా ఈజీగా జరిగిపోతుంది.
  • పాంబన్ వంతెనకు సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకూ 25-35 మీటర్ల లోతున పునాదులు వేశారు. కొన్నిచోట్ల భారీ రాళ్లు రాగా, నేరుగా వాటిలోకి బలమైన కాంక్రీట్‌ను చొప్పించారు.
  • ప్రపంచంలోనే రెండో అతి ఎక్కువ తుప్పు పట్టే ప్రాంతంగా పాంబన్‌ తీరానికి పేరుంది.
  • సముద్రపు కెరటాలు పాంబన్ వంతెనపైకీ వస్తుంటాయి. పాత పాంబన్ వంతెనకు చెందిన ఇనుము తుప్పుపట్టి, మందం మొత్తం కరిగిపోయింది.
  • పాంబన్ కొత్త వంతెనకు తుప్పు సమస్య రాకుండా దాని నిర్మాణాలపై 3 పొరలుగా పాలీసిలోక్సేన్‌ పెయింటింగ్‌ వేశారు. దీని కారణంగా రాబోయే 58 ఏళ్ల వరకు ఈ వంతెనకు తుప్పుతో సమస్య ఉండదు. చిన్నచిన్న మరమ్మతులు చేస్తే వందేళ్ల దాకా ఎలాంటి ఢోకా ఉండదు.
  • సముద్రంలోని దిమ్మెలు పాడు కాకుండా .. వాటి చుట్టూ కేసింగ్‌ విధానంలో ఐరన్‌ చట్రాలతో కాంక్రీట్ వేశారు.
  • వర్టికల్‌ లిఫ్ట్‌ వంతెనలో కనీసం ఒక్క బోల్టును కూడా వాడలేదు. కేవలం వెల్డింగ్‌తోనే దాన్ని జోడించారు.
  • వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో లింక్ చేశారు. గంటకు 58 కి.మీ వేగంతో గాలులు వీస్తే స్కాడా సెన్సర్లు ఆటోమేటిక్‌గా ఈ వంతెన మార్గాన్ని మూసేస్తాయి.
  • మత్స్యకారుల పడవలు, బార్జ్‌ పడవలు, నేవీ, పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చినప్పుడు సిబ్బంది దిమ్మెల పైనున్న గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్‌ చేస్తారు.

Also Read :Solar Great Wall : చైనా సోలార్ వాల్.. రెడీ అవుతున్న మరో అద్భుతం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • New Pamban Bridge
  • pamban bridge
  • railway sea bridge
  • Rameswaram Island
  • tamil nadu

Related News

    Latest News

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd