Vivo T2 Pro 5G: మార్కెట్లోకి మరో వివో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం వివో సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో వివో సంస్థ ఒకదాని తర్వాత ఒకటి మార్కెట్లోకి స్మార్ట్
- By Anshu Published Date - 04:00 PM, Fri - 15 September 23

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం వివో సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో వివో సంస్థ ఒకదాని తర్వాత ఒకటి మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అద్భుతమైన ఫీచర్లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరొక స్మార్ట్ ఫోన్ ను కూడా మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. వివో T2 ప్రో 5జీ తో పేరుతో మన దేశంలో కొత్త బడ్జెట్ T-సిరీస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ డివైజ్‌ను సెప్టెంబర్ 22 భారతదేశంలో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
కొత్త ఫోన్ లాంచ్ తేదీని వివో ఇండియా మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ లో రిలీజ్ చేసింది. ఎపిక్ గేమింగ్, స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం వివో T2 ప్రో 5G రాబోతున్నట్లు ట్వీట్‌లో పేర్కొంది. అయితే భారత్ లో వివో టీ2 ప్రో 5జీ ధర ఎంత ఉంటుందనే వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ డివైజ్ సుమారు రూ.23,999 ధరతో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 91మొబైల్స్ రిపోర్ట్ ప్రకారం.. కొత్త ఫోన్ iQOO Z7 Pro 5G మాదిరిగా, అదే ధరతో రావచ్చు. ఈ ఐక్యూ ఫోన్ గత నెలలో రూ.24వేలకు లాంచ్ అయింది. అయితే అధికారిక లాంచింగ్ తర్వాతే అసలు ధరల వివరాలు వెల్లడి కానున్నాయి. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే…
ఈ డివైజ్ కోసం వివో ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ మైక్రో-సైట్‌ను కూడా క్రియేట్ చేసింది. ఈ మైక్రో సైట్‌లో షేర్ చేసిన టీజర్ ఇమేజ్ ప్రకారం రాబోయే వివో T2 ప్రో 5జీ ఫోన్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానున్నట్లు తెలుస్తోది. సెల్ఫీల కోసం స్క్రీన్ మధ్యలో కెమెరా కటౌట్‌తో కూడిన డిస్‌ప్లే ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 64ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ యూనిట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 4కె వీడియోలను క్యాప్చర్ చేయగలదు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ డివైజ్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని నివేదిక వెల్లడించింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌తో రానుంది. 8జీబీ ర్యామ్,128జీబీ , 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభించనుంది.