Tecno Spark 10: అతి తక్కువ ధరకే టెక్నో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
దేశవ్యాప్తంగా రోజురోజుకి స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారుల
- By Nakshatra Published Date - 03:29 PM, Fri - 28 April 23
దేశవ్యాప్తంగా రోజురోజుకి స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆయా కంపెనీలు కూడా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. తరచూ నెలలో పదుల సంఖ్యలో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోని తాజాగా మార్కెట్ లోకి టెక్నో స్పార్క్ 10 4జీ ఫోన్ విడుదల అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో కూడా విడుదల అయింది. ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే మంచి మంచి ఫీచర్లను అందిస్తోంది.
ఈ ఫోన్ దీర్ఘకాలం ఉండే బాంబే బ్యాటరీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితమైన డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే తో రానుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ల విషయానికి వస్తే.. టెక్నో స్పార్క్ 10 4జీ స్మార్ట్‌ఫోన్ ఇంకా భారత్‌లోకి ప్రవేశించనప్పటికీ దీని ధర రూ.15 వేల లోపు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్ మనకు మెటా వైట్, మెటా బ్లూ, మెటా బ్లాక్ వంటి కలర్ లలో లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 720 x 1612 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో పాటు 6.6 అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది.
ధరల వారీగా టెక్నో స్పార్క్ 10 4జీ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio జీ37 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 సపోర్ట్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్లోని వర్చువల్ ర్యామ్‌ను 8GB వరకు పెంచుకోవచ్చు. అలాగే ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, AI సెన్సార్ రూపంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ AI సప్పోర్టెడ్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండనుంది. అలాగే ఇది 18W ఫ్లాష్ ఛార్జ్‌కు మద్ధతు కూడా లభిస్తుంది. అయితే ఈ ఫోన్లో 5జీ కనెక్టివిటీకి సప్పోర్ట్ లేదు. డ్యూయల్ సిమ్, 4జీ , వైఫై, బ్లూటూత్, NFC, జీపీస్ వైఫై, USB C పోర్ట్‌లకు అయితే మద్దతు ఇస్తుంది.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.