HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >5 Whatsapp Features Launching Very Soon

WhatsApp features: వాట్సాప్ లో త్వరలో 5 కొత్త ఫీచర్లు.. అవి ఇవే..!

వాట్సాప్‌ త్వరలో 5 కొత్త ఫీచర్లను లాంచ్‌ చేయనుంది. పంపిన మెసేజ్ లను నిర్ణీత టైంలోపు ఎడిట్ చేసే సౌలభ్యాన్ని కల్పించనుంది. అలాగే వాట్సాప్ గ్రూపులో సభ్యుల సంఖ్యను 1024కి పెంచనుంది.

  • Author : Gopichand Date : 17-10-2022 - 4:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whatsapp Clone
Whatsapp Clone

వాట్సాప్ తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త అప్‌డేట్‌ల సమూహాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ప్రస్తుతం అప్‌డేట్‌లపై పని చేస్తోంది. ఇది ప్రస్తుత గ్రూప్ చాట్ పార్టిసిపెంట్స్ పరిమితిని పెంచనుంది. వ్యూ వన్స్ చిత్రాలు, వీడియోల కోసం స్క్రీన్‌షాట్‌లను పరిమితం చేయనుంది. వాట్సాప్ వ్యాపార వినియోగదారుల కోసం ఎంపిక చేసిన ప్లాన్‌లలో ప్రీమియం ఫీచర్లను అందించడానికి వాట్సాప్ ప్రీమియం ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది. త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్న వాట్సాప్ ఫీచర్లలో కొన్నింటిని నిశితంగా పరిశీలిద్దాం. ఈ ఫీచర్‌లు ప్రస్తుతం బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

వాట్సాప్‌ త్వరలో 5 కొత్త ఫీచర్లను లాంచ్‌ చేయనుంది. పంపిన మెసేజ్ లను నిర్ణీత టైంలోపు ఎడిట్ చేసే సౌలభ్యాన్ని కల్పించనుంది. అలాగే వాట్సాప్ గ్రూపులో సభ్యుల సంఖ్యను 1024కి పెంచనుంది. అలాగే ఇకపై డాక్యుమెంట్లు పంపేటప్పుడు క్యాప్షన్ లు ఇవ్వొచ్చు. వాట్సాప్‌ మెసేజ్‌లు, ఫోటోలను ఇకపై స్క్రీన్ షాట్ తీయరాకుండా చేయనుంది. అలాగే బిజినెస్‌ వాట్సప్‌ అకౌంట్లకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్స్‌ను ప్రారంభించనుంది.

పంపించిన సందేశాలను నిర్ణీత సమయంలోపు ఎడిట్ చేసుకోవడానికి అనుమతించనుంది. పంపించిన 15 నిమిషాల వరకు ఇందుకు గడువు ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపులో గరిష్ఠంగా 512 మంది సభ్యులుగా ఉండొచ్చు. త్వరలో దీన్ని రెట్టింపు చేయనుంది. దీంతో ఒకే గ్రూపులో 1024 మంది సభ్యులుగా చేరొచ్చు.

ఇప్పటి వరకు వాట్సాప్ లో మనం ఇమేజ్, వీడియోలు పంపిస్తుంటే క్యాప్షన్ అడుగుతుంది. కానీ.. డాక్యుమెంట్లకు మాత్రం క్యాప్షన్ అడగదు. ఇకమీదట డాక్యుమెంట్లకూ క్యాప్షన్ ఇవ్వొచ్చు. ఒకరు పంపించిన సందేశాలను గుర్తు పెట్టుకోవడానికో లేదంటే ఆధారం కోసమో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. కానీ స్క్రీన్ షాట్ తీసుకోవడం త్వరలో సాధ్యపడకపోవచ్చు. యూజర్ల గోప్యత పరిరక్షణలో భాగంగా వాట్సాప్ దీనికి త్వరలోనే చెక్ పెట్టనుంది. ఒకరు తమ సందేశాలను స్క్రీన్ షాట్ తీసుకోకుండా ఉండాలంటే, పంపించే వారు వ్యూ వన్స్ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది. వ్యాపారుల వాట్సాప్ వినియోగం పెరుగుతోంది. చెల్లింపులు, ఆర్డర్ల స్వీకరణ, సమాచార, ప్రత్యుత్తరాలు, ఆఫర్లు ఇలా ఎన్నో రకాల సమాచారాన్ని కస్టమర్లతో పంచుకునేందుకు కంపెనీలు వాట్సాప్ ను ఉపయోగిస్తున్నాయి. ఇక మీదట వ్యాపార సేవల కోసం ప్రీమియం సబ్ స్క్రిప్షన్ సేవలను వాట్సాప్ అందించనుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • new edit tool
  • Premium plan
  • tech news
  • whatsapp
  • Whatsapp features

Related News

Wifi Using Tips

స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?

ఒకసారి నకిలీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయితే మీ బ్రౌజింగ్ యాక్టివిటీ, లాగిన్ వివరాలు, కొన్నిసార్లు బ్యాంకుకు సంబంధించిన కీలక సమాచారం కూడా హ్యాకర్ల చేతికి చిక్కవచ్చు.

  • WhatsApp Subscription

    ఇక‌పై వాట్సాప్‌లో కూడా సబ్‌స్క్రిప్షన్.. ధ‌ర ఎంతంటే?

Latest News

  • నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!

  • అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

  • మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

  • మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

  • ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd