World News
-
#World
Eric Garcetti: భారత్ లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి..!
లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్ ఎరిక్ గార్సెట్టి (Eric Garcetti) భారత్‌లో కొత్త అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టితో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ శుక్రవారం అధికారికంగా ప్రమాణం చేయించారు.
Published Date - 11:10 AM, Sat - 25 March 23 -
#India
240 Countries: 240 దేశాల్లో భారతీయ విద్యార్థులు.. ఏ దేశంలో ఎక్కువ ఉన్నారంటే..?
సుమారు 240 దేశాల్లో (240 Countries) భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయులు పైచదువుల కోసం బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలతో పాటు ఉజ్బెకిస్థాన్, ఫిలిప్పీన్స్, రష్యా, ఐర్లాండ్, కిర్గిస్థాన్, కజకిస్థాన్ వంటి దేశాలకు కూడా వెళ్తున్నారట.
Published Date - 08:45 AM, Sat - 25 March 23 -
#World
Mahatma Gandhi statue: కెనడాలో మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం
అమెరికా, బ్రిటన్, కెనడా వంటి పశ్చిమ దేశాల్లో ఖలిస్తాన్ మద్దతుదారుల నీచ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. తాజాగా కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని(Mahatma Gandhi statue) ధ్వంసం చేశారు.
Published Date - 07:55 AM, Sat - 25 March 23 -
#Sports
Rishi Sunak: క్రికెట్ ఆడిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. వీడియో వైరల్
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) తన చర్యలతో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారారు. టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టును తాను నివాసం ఉంటున్న 10 డౌనింగ్ స్ట్రీట్‌కు ఆహ్వానించారు.
Published Date - 01:34 PM, Fri - 24 March 23 -
#World
Putin Arrest Warrant: పుతిన్‌ను అరెస్ట్ చేస్తే యుద్ధం తప్పదు.. వార్నింగ్ ఇచ్చిన రష్యా మాజీ అధ్యక్షుడు
విదేశాల్లో పుతిన్‌ను అరెస్టు (Putin Arrest) చేయడమంటే సంబంధిత దేశం తమపై యుద్ధాన్ని ప్రకటించినట్లేనని రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతామండలి ఉప చైర్మన్ మెద్వెదేవ్ వ్యాఖ్యానించారు.
Published Date - 08:15 AM, Fri - 24 March 23 -
#India
Nisha Desai Biswal: భారత సంతతి మహిళ నిషా దేశాయ్ బిస్వాల్‌కు కీలక బాధ్యతలు.. ఎవరీ నిషా దేశాయ్..?
అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది. యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కమిషన్ డిప్యూటీ చీఫ్‌గా నిషా దేశాయ్ బిస్వాల్ (Nisha Desai Biswal)ను ఎంపిక చేస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 11:10 AM, Wed - 22 March 23 -
#Speed News
Earthquake: పాకిస్తాన్‌లో భూకంపం.. 11 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో మంగళవారం (మార్చి 21) రాత్రి 6.5 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు పాకిస్థాన్, భారత్‌లో కూడా భూకంపం సంభవించింది.
Published Date - 10:38 AM, Wed - 22 March 23 -
#Speed News
Starbucks CEO: స్టార్‌బక్స్ సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్..!
అంతర్జాతీయ సంస్థలకు సారథ్యం వహించే భారతీయుల జాబితా మరింతగా పెరుగుతోంది. తాజాగా కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ సీఈవో (Starbucks CEO)గా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు.
Published Date - 10:24 AM, Wed - 22 March 23 -
#World
Terrorists: ఉగ్రవాదుల చేతిలో పాక్ గూఢచారి హతం.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
వాయవ్య పాకిస్థాన్ లో మంగళవారం ఉగ్రవాదుల (Terrorists)తో జరిగిన ఎదురుకాల్పుల్లో పాక్ ఇంటెలిజెన్స్ అధికారి మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారని ఆ దేశ సైన్యం తెలిపింది.
Published Date - 07:55 AM, Wed - 22 March 23 -
#Speed News
Imran Khan: నన్ను చంపాలని చూస్తున్నారు.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!
కోర్టు విచారణ సందర్భంగా తన హత్యకు కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పేర్కొన్నారు. తోషాఖానా కేసు విచారణ నిమిత్తం శనివారం ఇస్లామాబాద్‌లోని కోర్టుకు చేరుకున్నప్పుడు తనను చంపేందుకు కుట్ర పన్నారని ఇమ్రాన్ తెలిపారు.
Published Date - 09:05 AM, Tue - 21 March 23 -
#World
Rupert Murdoch: 92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకోనున్న రూపర్ట్ మర్డోక్
మీడియా మొగల్ గా పేరుగాంచిన రూపర్ట్ మర్డోక్ (Rupert Murdoch) తన 92వ ఏట పెళ్లి చేసుకోబోతున్నాడు. బిలియనీర్ వ్యాపారవేత్త మాజీ పోలీసు కెప్టెన్ ఆన్ లెస్లీ స్మిత్ (66)తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించారు.
Published Date - 08:55 AM, Tue - 21 March 23 -
#World
Finland: అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్..!
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా వచ్చింది. ఇందులో ఫిన్లాండ్ (Finland) మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. గత 6 సంవత్సరాలుగా ఫిన్లాండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం.. గాలప్ వరల్డ్ పోల్ ఆధారంగా ఈ నివేదిక తయారు చేయబడింది.
Published Date - 06:26 AM, Tue - 21 March 23 -
#World
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద కేసు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) కష్టాలు తీరడం లేదు. ఆదివారం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్‌తో సహా డజనుకు పైగా నాయకులపై పాకిస్తాన్ పోలీసులు ఉగ్రవాద కేసు నమోదు చేశారు.
Published Date - 07:10 AM, Mon - 20 March 23 -
#World
Congo: కాంగోలో ఉగ్రదాడి.. 22 మంది మృతి
ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో మరోసారి ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ఉగ్రవాదులు 22 మందిని చంపడమే కాకుండా ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేసి వారితో తీసుకెళ్లారు. రెండు వేర్వేరు దాడుల్లో ఉగ్రవాదులు ఈ దారుణ హత్యలకు పాల్పడ్డారు.
Published Date - 06:46 AM, Mon - 20 March 23 -
#Speed News
Bangladesh: బంగ్లాదేశ్‌లో పెను విషాదం.. 17 మంది మృతి.. 30 మందికి గాయాలు
బంగ్లాదేశ్ (Bangladesh)లో వేగంగా వెళ్తున్న బస్సు లోయలో పడి 17 మంది మరణించారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది గాయపడినట్లు సమాచారం.
Published Date - 01:28 PM, Sun - 19 March 23