HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >4 3 Magnitude Earthquake Hits Afghanistan No Causalities

Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం.. అసలు భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసా..?

మంగళవారం తెల్లవారుజామున భారత్‌కు పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan)లో భూకంపం (Earthquake) సంభవించింది. భూకంప కేంద్రం ఫైజాబాద్. ఇక్కడ రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది.

  • Author : Gopi Date : 09-05-2023 - 7:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chile Earthquake
Chile Earthquake

Earthquake: మంగళవారం తెల్లవారుజామున భారత్‌కు పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan)లో భూకంపం (Earthquake) సంభవించింది. భూకంప కేంద్రం ఫైజాబాద్. ఇక్కడ రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో మంగళవారం ఉదయం 120 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 116 కిలోమీటర్ల దూరంలో ఉంది. NCS ప్రకారం.. ఈ భూకంపం భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3.23 గంటలకు సంభవించింది.

భూకంపాలు ఎందుకు వస్తాయి..?

భూమి లోపల ఆకస్మిక కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపం అనేది భూమి క్రస్ట్‌లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ (ఒత్తిడి శక్తి). దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్ లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. రాతి పొర వాటిని పైకి రానీయకుండా చేస్తుంది. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు.. బలహీన ప్రాంతాాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది. భూకంపాలు రావడానికి మానవ తప్పిదాలు కూడా ఒక కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, భూగర్భ జలాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయడం, అడవుల్లో చెట్లను నరికివేయడం వంటి వాటి వల్ల కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది.

Also Read: Space Experiments: అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయి.. 276 రోజుల తర్వాత భూమిపైకి అంతరిక్ష నౌక..

5 కంటే తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు సాధారణంగా తక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు నష్టం జరగవచ్చు. 2011లో జపాన్ తీరంలో 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఇక్కడ సునామీ అలలు ఎగిసిపడడంతో మరింత విధ్వంసం నెలకొంది. ఈ భూకంపంలో దాదాపు 20 వేల మంది చనిపోయారు. అంతకుముందు 2006లో ఇండోనేషియాలో 9 తీవ్రతతో భూకంపం వచ్చి 5,700 మందికి పైగా మరణించారు.

ఇప్పటివరకు భారతదేశంలో 8 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు నాలుగు సార్లు సంభవించాయి. మొదటిది 1897లో షిల్లాంగ్‌లో, రెండవది 1905లో కాంగ్రాలో, మూడవది 1934లో బీహార్-నేపాల్‌లో, నాల్గవది 1950లో అస్సాం-టిబెట్‌లో. వీటిలో వేలాది మంది చనిపోయారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నివేదిక ప్రకారం.. భారతదేశంలో 59 శాతం భూకంపం పరంగా అత్యంత సున్నితమైనదిగా పరిగణించబడుతుంది. అంటే 8 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు ఎప్పుడైనా సంభవించవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Afghanistan
  • earthquake
  • Earthquake News
  • Earthquakes
  • world news

Related News

Ceasefire Deadline

సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని మెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే సంతకం చేయడానికి తానే స్వయంగా ఇస్లామాబాద్ వస్తానని ఒక పెద్ద ప్రకటన చేశారు.

  • Donald Trump

    సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌!

  • Iran-US Ceasefire

    గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

  • Ceasefire Deadline

    ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

  • Trump Next Target

    ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?

Latest News

  • Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

  • డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

  • CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

  • Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

Trending News

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    • నేటి బంగారం ధ‌ర‌లివే.. పెరిగాయా? త‌గ్గాయా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd