Telangana Politics
-
#Telangana
Harish Rao : లగచర్లలా గుమ్మడిదలను చేయద్దు
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు గుమ్మడిదలలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై తీవ్రంగా స్పందించారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, నర్సాపూర్ చెరువు కలుషితమవుతుందని, ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. గుమ్మడిదల ప్రజల ఆందోళనకు మద్దతు తెలిపిన హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ ప్రాజెక్టును తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
Date : 14-02-2025 - 5:57 IST -
#Telangana
Talasani Srinivas Yadav : ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్‌కు తలసాని శ్రీనివాస్ సవాల్
Talasani Srinivas Yadav : తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా సర్వే నిర్వహించిందని, 60 లక్షల మంది ఓటర్లు ఎక్కడ పోయారో లెక్కలు లేకపోవడం దారుణమన్నారు. బీసీ రిజర్వేషన్లపై చట్టం చేయాలని డిమాండ్ చేస్తూనే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగలిగితే చూపించాలని సవాల్ విసిరారు.
Date : 14-02-2025 - 3:51 IST -
#Telangana
Ponnam Prabhakar : ఇది రీసర్వే కాదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం
Ponnam Prabhakar : కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పత్రికా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వే ప్రక్రియపై స్పష్టత ఇస్తూ, బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, రాహుల్ గాంధీ పర్యటనపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండించారు.
Date : 13-02-2025 - 12:41 IST -
#Telangana
MLC Elections : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి బీఆర్ఎస్ వెనుకడుగుకు గల కారణాలేంటీ..?
MLC Elections : తెలంగాణలో బీఆర్ఎస్ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో రెండు పర్యాయాలు పాలనలో ఉన్న ఈ పార్టీ ఇప్పుడు ఎన్నికలకు దూరంగా ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఆలోచనల్లో మార్పు వచ్చిందా? లేక ఇది వ్యూహాత్మక నిర్ణయమా? అనే అంశంపై విస్తృతంగా చర్చ కొనసాగుతోంది.
Date : 12-02-2025 - 2:20 IST -
#Telangana
Aadi Srinivas : విషయం తెలియకుండా విమర్శలా.. దుష్ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ హరీష్ రావు
Aadi Srinivas : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధపు ఆరోపణలు చేయడంలో ఎవరినీ మించిపోయారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. రైతు భరోసా నిధుల పంపిణీపై హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.
Date : 12-02-2025 - 12:40 IST -
#Telangana
Minister Seethakka : కేటీఆర్‌కు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు
Minister Seethakka : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబం సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనకుండానే ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదని మంత్రి సీతక్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుల గణనపై బీఆర్ఎస్ నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని, రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకుంటారని ఆమె తెలిపారు.
Date : 12-02-2025 - 11:48 IST -
#Telangana
Harish Rao : ఇది ప్రజా పాలనా? ఇది ప్రజా వ్యతిరేక పాలన..!
Harish Rao : హరీష్ రావు తన ట్వీట్లో, "చిన్న జీతాలపై ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు, జీతాల జాప్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నెల జీతం లేకుండా వారు దైనందిన జీవితాన్ని కొనసాగించడం ఎంతటి కష్టమో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. బ్యాంకుల ఈఎంఐలు (EMI) చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్నారు." అని పేర్కొన్నారు.
Date : 12-02-2025 - 10:10 IST -
#Telangana
Supreme Court : ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. మరోసారి సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court : తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రీజనబుల్ టైమ్ విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పది నెలలు గడిచినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. తదనంతరం ఈ కేసు విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.
Date : 10-02-2025 - 1:13 IST -
#Telangana
Konda Surekha : మీ మోదీ అంకుల్ గెలుపులో మీ సోదరి కీలక పాత్ర పోషించింది..
Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన వ్యాఖ్యల యుద్ధంలో మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు నేపథ్యంలో రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన విమర్శలకు ప్రతిస్పందిస్తూ, మీ మోదీ అంకుల్ గెలుపులో మీ సోదరి కవిత కీలక పాత్ర పోషించిందంటూ చురకలంటించారు.
Date : 08-02-2025 - 6:43 IST -
#Telangana
Mahesh Kumar Goud : శాస్త్రీయంగానే కులగణన సర్వే.. పార్టీలో క్రమశిక్షణ తప్పితే సహించం
Mahesh Kumar Goud : పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తగిన చర్యలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ అజెండాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు.
Date : 05-02-2025 - 4:30 IST -
#Telangana
BC Caste Enumeration : బీసీ కులగణన చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం
BC Caste Enumeration : బీఆర్ఎస్ (BRS) సహా ఇతర ప్రతిపక్షాలు ఇందులో తప్పుడు లెక్కలు ఉన్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి
Date : 03-02-2025 - 9:55 IST -
#Telangana
KTR : ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి.. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ చురక
KTR : ఈ అంశానికి సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్‌కు కేటీఆర్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం జత చేసింది. కేటీఆర్ వేసిన పిటిషన్‌ను దానం నాగేందర్, కడియం శ్రీహరి , తెల్లం వెంకట్రావు అనర్హత పిటిషన్‌తో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Date : 03-02-2025 - 5:38 IST -
#Special
Political Game : అధికార దాహం, రాజకీయ కుట్రలు, అసూయా ద్వేషాలు.. తెలంగాణలో కుర్చీలాట
దీంతో సదరు రాజకీయ నేత(Political Game of Thrones) ఒక సంపన్న ఎమ్మెల్యేను ఆశ్రయించాడు.
Date : 03-02-2025 - 4:48 IST -
#Telangana
Jagga Reddy : కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు జగ్గారెడ్డి సవాల్
Jagga Reddy : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణను పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారని ఆరోపించారు.
Date : 03-02-2025 - 4:27 IST -
#Telangana
KCR Hot Comments: నేను కొడితే మాములుగా ఉండదు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
కైలాసం ఆడంగా పెద్ద పాము మింగినట్లు అయ్యింది తెలంగాణ ప్రజల పని అయిందన్నారు. మళ్ళీ కరెంట్ కోతలు.. మంచి నీళ్ల కరువు వచ్చాయన్నారు. ఇది ఏంది అని అడిగితే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.
Date : 31-01-2025 - 3:44 IST