Telangana Politics
-
#Telangana
KTR Phoned Sunil Rao: బీఆర్ఎస్‌లో కలవరం.. పార్టీ మారొద్దంటూ సునీల్ రావుకు కేటీఆర్ ఫోన్?
పార్టీ మార్పుపై కరీంనగర్ జిల్లా మేయర్ సునీల్ రావు క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులతో నాకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 10:26 AM, Sat - 25 January 25 -
#Telangana
KTR : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌ను క్రైమ్ సిటీగా మార్చారు
KTR : కాంగ్రెస్ అరాచక పాలనపై మండిపడ్డ కేటీఆర్ దివ్యాంగుడైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించడం, ఫ్లెక్సీలు చింపేయడం వంటి ఘటనలను ఆయన ఉదహరించారు. నల్గొండలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు పోలీసుల ముందే భూపాల్ రెడ్డిని బూతులు తిడుతూ దాడికి పాల్పడటం తీవ్ర విచారకరమని అన్నారు.
Published Date - 09:49 AM, Wed - 22 January 25 -
#Speed News
Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక
Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురైయ్యారు. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించి స్టంట్ అమర్చారు.
Published Date - 09:05 PM, Tue - 21 January 25 -
#Telangana
Harish Rao : మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా..?
Harish Rao : మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు ‘‘మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో మీరు అర్థం చేసుకున్నారా? మీరు నిర్వహిస్తున్న గ్రామ సభల ద్వారా ప్రజలపై పెరుగుతున్న వ్యతిరేకత తేటతెల్లమైంది. ప్రజలు ఊరూరా తిరుగుతున్నా, ఎవరికీ తగిన గౌరవం ఇవ్వడంలో విఫలమైన మీ ప్రభుత్వంపై ప్రజల్లో చైతన్యం పెరిగింది.
Published Date - 06:16 PM, Tue - 21 January 25 -
#Telangana
MP Raghunandan Rao : ఎమ్మెల్సీ కవితకు ఎంపీ రఘుందన్ రావు కౌంటర్..
MP Raghunandan Rao : మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఆమె ఇంకా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే, ఆమెకు మంచి డాక్టర్‌ను చూపించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు.
Published Date - 06:48 PM, Mon - 20 January 25 -
#Telangana
Nara Lokesh : త్వరలోనే తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం
Nara Lokesh : త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబడుతుందని, తెలంగాణ ప్రజలు టీడీపీపై చూపిస్తున్న ప్రేమ, నమ్మకం తమకు గొప్ప ప్రేరణగా ఉందన్నారు. తెలంగాణలో ఇప్పటికే 1.60 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకోవడం ప్రగతికి సంకేతమని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు.
Published Date - 12:05 PM, Sat - 18 January 25 -
#Telangana
MLA Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు
దాడి కేసులో పాడి కౌశిక్‌కు బెయిల్ మంజూరు చేస్తూ కరీంనగర్ జడ్డి తీర్పునిచ్చారు. పాడి రిమాండ్ రిపోర్ట్‌ను జడ్జి కొట్టేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్ చల్ చేశారని, ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశారని ఆయనపై మొత్తం 3 కేసులను పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Published Date - 10:11 AM, Tue - 14 January 25 -
#Telangana
KTR House Arrest: పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ హౌస్ అరెస్ట్!
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా ఎమ్మెల్యే మీద కేసులా?
Published Date - 09:34 AM, Tue - 14 January 25 -
#Telangana
KTR : మందా జగన్నాథం కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
KTR : "మందా జగన్నాథం తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి. మహాబూబ్ నగర్ అభివృద్ధిని కాంక్షించారు. రాజకీయాల్లో ఆయన ఒక సౌమ్యుడు, వివాదరహితుడు. ఆయన మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయింది. నాలుగు సార్లు ఎంపీగా అయిన ఆయన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని కేటీఆర్ అన్నారు.
Published Date - 12:14 PM, Mon - 13 January 25 -
#Telangana
Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు.. !
Padi Kaushik Reddy : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌తో వాగ్వాదం కారణంగా హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటన క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో కరీంనగర్ జిల్లాలోని రాజకీయాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారని సంజయ్ పీఏ ఫిర్యాదు చేయగా, కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు, సమావేశంలో గందరగోళం సృష్టించినందుకు మరో కేసు నమోదైంది.
Published Date - 10:20 AM, Mon - 13 January 25 -
#Telangana
KTR : నీలా లుచ్చా పనులు చేసినోళ్లం కాదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR : కేటీఆర్, రేవంత్ రెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ, "ఇది కేవలం ఒక లొట్టపీసు కేసు మాత్రమే" అని అన్నారు. ఆయన వాఖ్యలు కొనసాగిస్తూ, "రేవంత్‌కు తన పని నిరంతరం జైలులో ఉంటూ, ప్రజలను కఠినమైన పరిస్థితుల్లో ఉంచి, పైశాచిక ఆనందం అనుభవించాలనే తపన ఉన్నట్లు కనిపిస్తోంది. నేను దేశంలో పెట్టుబడులు తెచ్చి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంటే, నీకు మాత్రం భయపడే దేమీ లేదు" అని వ్యాఖ్యానించారు.
Published Date - 09:07 PM, Thu - 9 January 25 -
#Telangana
KTR : మళ్లీ విచారణకు రావాలని ఏమీ చెప్పలేదు..
KTR : "మీరు దమ్ముంటే, లైడిటెక్టర్ పరీక్ష పెట్టండి. నేను అందులో పాల్గొంటాను. ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టి ఈ చర్చ జరిపిద్దాం. ఎవడు దొంగనో, ఎవడో నిజమైన నాయకుడు అనేది ప్రజలు చూసి తేల్చుకుంటారు" అని కేటీఆర్ అన్నారు.
Published Date - 07:23 PM, Thu - 9 January 25 -
#Telangana
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్.. అధిక ప్రాధాన్యత వీరికే!
రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో కలెక్టర్లతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ ఉండనుంది.
Published Date - 06:27 PM, Thu - 9 January 25 -
#Speed News
Deshapathi Srinivas : దిల్ రాజుపై దేశపతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
Deshapathi Srinivas : తెలంగాణలో సినిమా టికెట్ల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు నిర్మాతగా ఉన్న సినిమాకు ఎలా ప్రత్యేక మినహాయింపులు ఇస్తారని ప్రశ్నించారు.
Published Date - 05:57 PM, Thu - 9 January 25 -
#Telangana
Ravula Sridhar Reddy : కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
Ravula Sridhar Reddy : తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లడం కాంగ్రెస్ నేతలకు ఆనందం కలిగిస్తోందని, రాజకీయ వ్యూహాలకు ఇది భాగమని వ్యాఖ్యానించారు.
Published Date - 05:42 PM, Thu - 9 January 25