Nagam Janardhan Reddy : చంద్రబాబుతో నాగం జనార్ధన్ రెడ్డి భేటీ వెనుక అసలు కారణం..?
Nagam Janardhan Reddy : గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన నాగం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ప్రయాణం కొనసాగించారు
- By Sudheer Published Date - 08:09 PM, Thu - 13 March 25

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)తో సీనియర్ రాజకీయ నేత నాగం జనార్ధన్ రెడ్డి (Nagam Janardhan Reddy) భేటీ కావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన నాగం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ప్రయాణం కొనసాగించారు. అయితే ఇటీవల రాజకీయంగా సైలెంట్‌గా ఉన్న నాగం, తిరిగి చంద్రబాబును కలవడం విస్తృత చర్చకు దారి తీసింది. ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి కోర్టు విచారణలో పాల్గొన్న అనంతరం ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యారు.
Amardeep : ఎవర్ని వదిలిపెట్టను అంటూ హెచ్చరించిన బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో టీడీపీలో కీలకంగా ఉన్న నేతలతో ఆయన మళ్లీ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి అసంతృప్తులైన నేతలను ఆకర్షించేందుకు చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారని భావిస్తున్నారు. నాగం జనార్ధన్ రెడ్డి భేటీ కూడా ఈ వ్యూహంలో భాగమేనా అనే ఊహాగానాలు రేగుతున్నాయి.
Delimitation : దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఇలా ప్రతీకారం తీర్చుకుంటుంది – వైస్ షర్మిల
నాగం జనార్ధన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్నప్పటికీ, ఇటీవల రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నారు. 2023 ఎన్నికల్లో ఆయన ఆశించిన టికెట్ దక్కకపోవడం, ఇతర పార్టీలలో అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై ఆసక్తి పెరిగింది. తెలంగాణలో టీడీపీ పునరుద్ధరణ, బీజేపీతో కలిసే అవకాశాలు, పాత నేతల రీ-ఎంట్రీ వంటి అంశాలు ఇప్పుడే చర్చనీయాంశమవుతున్నాయి. నాగం – చంద్రబాబు భేటీ ఈ రాజకీయ సమీకరణాల్లో మరింత వేడిని పెంచింది.