Rain Alert : తెలంగాణలోని ఆ జిల్లాలో వర్షాలే వర్షాలు..
Rain Alert : ఉమ్మడి ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
- By Sudheer Published Date - 07:07 PM, Mon - 14 October 24

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మారడంతో తెలంగాణ (Telangana) లో మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సౌత్ ఏపీ తీరంలోని పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సాగతి సముద్రం నుండి 6 కిమీల ఎత్తు వరకు చక్రవాతపు ఆవర్తనం కేంద్రీకృతం అయింది. దీని ప్రభావంతో తెలంగాణలో నేటి నుండి మూడు రోజులు (3 Days) వర్షాలు పడగనున్నాయి. ఉమ్మడి ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మంగళ, బుధవారాల్లో ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక సోమవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
కూకట్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బాలానగర్, ఖైరతాబాద్, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతినగర్, పటాన్‌చెరు, మేడ్చల్, కృష్ణాపూర్, గండిమైసమ్మ, మల్లంపేట్, దుండిగల్, వికారాబాద్ జిల్లాలోని తాండూరు, బహదూర్‌పల్లి, సూరారం, గుండ్ల పోచంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. దసరా సెలవుల అనంతరం నగరానికి చేరుకుంటున్న ప్రజలు ట్రాఫిక్‌లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 4 రోజులు అక్కడ భారీ నుంచి కుండపోత వానలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read Also : Chiranjeevi Blood Bank : చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసిన ఎమ్మెల్యే.. అభినందించిన మెగాస్టార్..