Green Alerts : తెలుగు సహా 12 భాషల్లో వెదర్ అప్‌డేట్స్.. ఇక హైపర్ లోకల్ ఇన్ఫో
Green Alerts : ఇకపై హైపర్ లోకల్‌గానూ వాతావరణ అంచనాలు దేశ పౌరులకు అందనున్నాయి. అది కూడా ప్రధాన ప్రాంతీయ భాషల్లో !!
- Author : Pasha
Date : 17-01-2024 - 11:19 IST
Published By : Hashtagu Telugu Desk
Green Alerts : ఇకపై హైపర్ లోకల్‌గానూ వాతావరణ అంచనాలు దేశ పౌరులకు అందనున్నాయి. అది కూడా ప్రధాన ప్రాంతీయ భాషల్లో !! హిందీ, ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, బెంగాలీ లాంటి 12 భారతీయ భాషల్లో ఈ సేవలు లభించనున్నాయి. భారత వాతావరణ శాఖ, భూ శాస్త్రాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, గ్రీన్ అలర్ట్ మౌసమ్ సేవ సంయుక్తంగా ‘పంచాయత్ మౌసం సేవా పోర్టల్’ను అభివృద్ధి చేశాయి. భారత వాతావరణ విభాగం(ఐఎండీ) 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పోర్టల్‌ను లాంచ్ చేశారు. దీని ద్వారా ప్రాంతీయ భాషలలో వాతావరణ సూచనలను దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీ హెడ్, పంచాయతీ కార్యదర్శికి చేరవేస్తారు. ‘పంచాయత్ మౌసం సేవా పోర్టల్’కు సంబంధించిన మొబైల్ యాప్‌ను కూడా విడుదల చేశారు. తీవ్రమైన వాతావరణ హెచ్చరికలతో పాటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం, గాలుల వేగం వంటి వివరాలు ‘పంచాయత్ మౌసం సేవా పోర్టల్’, యాప్‌లలో లభిస్తుంది. ఈ సమాచారాన్ని వాడుకొని రైతులు, వ్యాపార వర్గాలు(Green Alerts) లబ్ధి పొందొచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక www.greenalerts.in అనే వెబ్‌సైట్ ద్వారా కూడా ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన తాజా వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకోవచ్చు. greenalerts వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే హోం పేజీలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లు కనిపిస్తాయి. వాటిలో మనకు కావాల్సిన రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసుకొని.. ఆ తర్వాత జిల్లా పేరును ఎంచుకోవాలి. ఆ తర్వాత మండలాలు బ్లాక్ ల పేర్లు కనిపిస్తాయి. అక్కడ వాతావరణానికి సంబంధించి సమస్త సమాచారం తెలుసుకోవచ్చు. వ్యవసాయ పనులు, నిర్మాణపు పనులు ప్రారంభించేముందు, పెళ్లిళ్లు చేసేవారు, అవుట్ డోర్ ఈవెంట్లు ప్లాన్ చేసుకునే వారు వాతావరణ అంచనాలు సరిచూసుకునేందుకు ఈ పోర్టల్స్, యాప్‌లను వాడొచ్చు. రాబోయే ఐదేళ్లలో తమ రాడార్లు 39 నుంచి 86కి పెరుగుతాయని, రాష్ట్రాలతో కలిసి ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను పెంచుతున్నామని ఐఎండీ అధికార వర్గాలు చెబుతున్నాయి.
Also Read: PM Modis Village: ప్రధాని మోడీ సొంతూరిలో ప్రాచీన నాగరికత ఆనవాళ్లు.. విశేషాలివీ
భారత్ ను చలి, వర్షాలు భయపెడుతున్నాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉత్తరాధి రాష్ట్రాలన్నింటిలో చలిగాలులు కొనసాగుతున్నాయి. దట్టమైన పొగమంచు ప్రజలను అస్వస్థతకు గురిచేస్తోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.ఉత్తర భారతదేశంలో విపరీతమైన చలి కొనసాగుతుంది. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్, ఉత్తరాఖండ్‌లలో ఈరోజు, రేపు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. యుపి-బీహార్, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లలో చలి తీవ్రత మరింత భయపెడుతోంది.