Narendra Modi
-
#Andhra Pradesh
Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..
ఏపీలో మావిగన్ గురించి చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్లో వేగం పెంచడానికి ప్రయత్నిస్తుండగా.. జగన్ మాత్రం మావిగన్ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధాని నిర్మిస్తే బాగుంటుందని చెబుతున్నారు. మొదట జగన్ నోటి నుంచి ‘మావిగన్’ అనే మాట వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ జులై 1న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగన్ మాట్లాడుతూ.. 2029 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రధాన అజెండా మావిగన్ అని ప్రకటించారు. మావిగన్ […]
Date : 03-07-2026 - 12:20 IST -
#India
India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం
భారత్‌పై ఎక్కువ ఉగ్రదాడులు చేసే లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జపాన్ ప్రధాని భారత పర్యటనలో భాగంగా ఉగ్రవాదంపై మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని తకైచి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలపై సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారత్ – జపాన్ 16వ వార్షిక […]
Date : 03-07-2026 - 11:11 IST -
#World
Venezuela Earthquake: భూకంపాల్లో దెబ్బతిన్న వెనిజులాకు ప్రధాని మోదీ భారీ మద్దతు.. సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని వెల్లడి
భీకర జంట భూకంపాలు వెనెజువెలా దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ శతాబ్ద కాలంలోనే అత్యంత శక్తివంతమైనవిగా నమోదైన ఈ భూకంపాల విధ్వంసంపై భారత ప్రధానమంత్రి మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ… విపత్తు బాధితులకు, వెనెజువెలా ప్రభుత్వానికి భారతదేశం తరఫున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కష్టకాలంలో వెనెజువెలాకు అవసరమైన అన్ని రకాల మానవీయ, వైద్య సహాయసహకారాలను అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం వెనెజువెలాలోని […]
Date : 25-06-2026 - 3:12 IST -
#India
PM MODI: మోదీ కేబినెట్ లో మార్పుపై చర్చ?
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవ్వడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (Cabinet Reshuffle) తథ్యమనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికలు, పార్టీ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని పనితీరు సరిగ్గా లేని కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి, వారి స్థానంలో కొత్త ముఖాలకు, యువ నాయకులకు పదవులు ఇవ్వనున్నట్లు […]
Date : 24-06-2026 - 11:16 IST -
#India
Prakash Raj: కాక్‌రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మోదీపై సెటైర్.. వీడియో వైరల్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ డిజిటల్ విప్లవంలోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతూ పోస్ట్ చేసిన ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. Cockroach eating mangoes.. yummy 😜😜😜#CockroachJantaParty #justasking pic.twitter.com/8oEseWgqtF — Prakash Raj (@prakashraaj) May 22, 2026 ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ మామిడి పండులో ఐస్ క్రీమ్ వేసుకుని తింటూ […]
Date : 22-05-2026 - 5:03 IST -
#India
Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్ గాంధీ
దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటిస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో పర్యటించిన ఆయన చురువా హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని.. ప్రజలను బయటకు వెళ్లొద్దని ప్రధాని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయనేమో ప్రపంచమంతా చుట్టేస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. ముందుముందు దేశంపై ఒక పెద్ద ఆర్థిక తుపాను విరుచుకుపడబోతోందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. […]
Date : 19-05-2026 - 3:44 IST -
#Trending
UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్
భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య ఇంధన రంగ భాగస్వామ్యం మరింత బలపడింది. భారత వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాల్లో (స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్) 30 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును నిల్వ చేసేందుకు యూఏఈ అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబి పర్యటన సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో జరిపిన చర్చల అనంతరం ఈ కీలక ఒప్పందం కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. […]
Date : 16-05-2026 - 9:56 IST -
#India
Pm Modi: ఇక గ్యాస్, పెట్రోల్ కష్టాలకు చెక్?
హర్మూజ్ జలసంధిలో నెలకొన్న తీవ్ర సంక్షోభం కారణంగా ఎదురవుతున్న ఇంధన సరఫరా సవాళ్లను అధిగమించేందుకు భారత ప్రభుత్వం ఒక సాహసోపేతమైన, వ్యూహాత్మక ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోస్తోంది. గల్ఫ్ దేశమైన ఒమన్ నుంచి నేరుగా గుజరాత్ తీరానికి సముద్ర గర్భం ద్వారా సహజవాయువును తరలించేందుకు ఉద్దేశించిన ‘మిడిల్ ఈస్ట్-ఇండియా డీప్‌వాటర్ పైప్‌లైన్ (MEIDP)’ ప్రాజెక్టుపై కేంద్రం దృష్టి సారించింది. ఈ బృహత్తర ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక (DFR) సిద్ధం చేయాలని గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ […]
Date : 15-05-2026 - 11:17 IST -
#India
Cm Vijay: మోదీకి సీఎం విజయ్ లేఖ
తమిళనాడులోని టెక్స్‌టైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని, దానిని ఆదుకునేందుకు పత్తిపై ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి విజయ్.. ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు. పత్తి, నూలు ధరలు విపరీతంగా పెరగడంతో రాష్ట్రంలోని టెక్స్‌టైల్ రంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “తమిళనాడు, దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్, దుస్తుల ఎగుమతి రాష్ట్రం. ముఖ్యంగా గ్రామీణ, పాక్షిక పట్టణ […]
Date : 15-05-2026 - 10:24 IST -
#Business
Gold Imports: బంగారం,వెండి పై సుంకాలు రెట్టింపు చేసిన కేంద్రం…
దేశంలో బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 6% నుంచి 15%కి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇందులో 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కాగా, మరో 5% అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్ (ఏఐడీసీ) రూపంలో ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయికి (95.75) పడిపోవడం, వాణిజ్య లోటు పెరగడంతో దిగుమతులను కట్టడి చేసేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ […]
Date : 13-05-2026 - 9:40 IST -
#Business
Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా రెండో సెషన్‌లో కూడా అమ్మకాల సునామీ కొనసాగింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమనడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా అన్ని రంగాల షేర్లలోనూ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు పతనమై 74,559.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 436.3 పాయింట్లు నష్టపోయి 23,379.55 వద్ద ముగిసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో […]
Date : 12-05-2026 - 5:45 IST -
#Business
Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్
భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం సెషన్‌లో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ కొవిడ్ నాటి చర్యల్ని ప్రస్తావించగా, అదే సమయంలో అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సూచీలు పడిపోతున్నాయి. ఇక్కడ బంగారం కొనుగోళ్లపై మోదీ ప్రకటనతో గోల్డ్ స్టాక్స్ కుప్పకూలాయి. ఇంట్రాడేలో 12 శాతం వరకు పడిపోవడంతో ఇన్వెస్టర్లకు నష్టాలు వస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో […]
Date : 11-05-2026 - 2:40 IST -
#Cinema
Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీలో తనకు రాముడు, కృష్ణుడు వంటి మహనీయులు కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భరణి తన పోస్టులో “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ, వాళ్లందరి అంశలతో ఉన్న మోదీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. […]
Date : 11-05-2026 - 2:08 IST -
#Devotional
Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘సోమనాథ్ అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాలకు హాజరయ్యే ముందు ప్రధాని మోదీ సోమనాథ్‌లో భారీ రోడ్ షో నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ సర్కిల్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర […]
Date : 11-05-2026 - 12:46 IST -
#Cinema
Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ తన రాజకీయ మొగ్గును, సామాజిక దృక్పథాన్ని స్పష్టం చేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ రాజకీయ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడానికి వెనుకాడతారు, కానీ రష్మీ మాత్రం ఎంతో ధైర్యంగా తన గళాన్ని వినిపించారు. రష్మీ గౌతమ్ తన పోస్ట్‌లో భారతీయ జనతా పార్టీకి, ప్రధాని మోదీకి తన పూర్తి మద్దతు ఉంటుందని నిస్సంకోచంగా ప్రకటించారు. అయితే, ఇదే సమయంలో ఒక ముఖ్యమైన క్లారిటీ […]
Date : 11-05-2026 - 12:14 IST