HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Us President Donald Trump Says Modi Promised Him

Us President : మోదీ తనకు మాటిచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..!

  • Author : Vamsi Chowdary Korata Date : 16-10-2025 - 5:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pm Modi Trump Putin
Pm Modi Trump Putin

రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆపేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు మాటిచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. మా దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే ఇంధన ఎంపికల్లో ప్రాధాన్యం ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆయిల్, గ్యాస్‌ కొనుగోలు చేసే దేశాల్లో భారత్‌ కీలకమైంది. ప్రస్తుత ఇంధన అస్థిర పరిస్థితుల్లో భారత వినియోగదారుల ప్రయోజనాలకే మేము అధిక ప్రాధాన్యత ఇస్తాం.. భారత దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యంపైనే ఆధారపడి ఉన్నాయి. స్థిరమైన ధరలు, సురక్షిత సరఫరాలను నిర్ధరించడమే మా ప్రధాన లక్ష్యం.. అంతర్జాతీయంగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగడంతో పాటు సప్లయ్ ఛైన్‌ను విస్తరించడానికే మేం అధిక ప్రాధాన్యం ఇస్తాం’ అని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అమెరికా నుంచి చమురు దిగుమతుల గురించి కూడా ప్రస్తావించారు. తన ఇంధన దిగుమతులను విస్తరించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో గడచిన దశాబ్దకాలంలో పురోగతి సాధించామని చెప్పారు. దీనిపై మా అధికార యంత్రాంగం చర్చలు కొనసాగిస్తోందని తెలియజేశారు. అయితే, రష్యా చమురు దిగుమతులను ఆపేస్తామని మోదీ తనకు హామీ ఇచ్చారన్న ట్రంప్‌ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.

 

అటు, అమెరికా అధ్యక్షుడు ప్రకటనపై మాస్కో సైతం స్పందించింది. భారత ఆర్థిక వ్యవస్థకు రష్యా చమురు దిగుమతులు అత్యంత కీలకమని న్యూఢిల్లీలో రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్‌ అన్నారు. ఇరుదేశాల కొనసాగుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యం నమ్మకం అనే దృఢమైన పునాదిపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ విధానాలను అవగాహన చేసుకొని తాము ముందుకుసాగుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో భారత్‌- అమెరికా సంబంధాల్లో తాము జోక్యం చేసుకోబోమని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో భారత్‌తో తమ దీర్ఘకాల బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అసహనం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే భారత్‌పై అదనంగా 25 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో రష్యా చమురు దిగుమతులను ఆపేస్తామని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • narendra modi
  • PM Modi- Putin
  • Russian oil
  • world news

Related News

Attack on Chabahar port after Trump's warning

US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

డొనాల్డ్ ట్రంప్, మరిన్ని దాడులు జరిగితే మరింత బలమైన ప్రతిస్పందన ఉంటుందని టెహ్రాన్‌ను హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత, గురువారం నాడు అమెరికా ఇరాన్ యొక్క వ్యూహాత్మక ఓడరేవు అయిన చబహార్‌లోని కీలక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, ఈ దాడులు ఆగ్నేయ ఓడరేవు నగరంలోని రెండు సముద్ర రేవులను మరియు ఒక సముద్ర ట్రాఫిక్ నియంత

  • Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.

    Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

  • Highly Emotional Atmosphere

    Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

  • A new chapter in India-Japan relations

    India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం

Latest News

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd