HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >A Grand Flag Hoisting Ceremony By The Prime Minister

Ayodhya Ram Temple : ప్రధాని చేతుల మీదుగా వైభవంగా ధ్వజారోహణం!

  • Author : Vamsi Chowdary Korata Date : 25-11-2025 - 2:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dhwajarohan In Ayodhya
Dhwajarohan In Ayodhya

అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు ముగిశాయి. దీనికి సంకేతంగా అయోధ్యంలో ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. అయోధ్య ఘట్టంలో ఈ వేడుక ఓ మైలురాయిగా నిలవనుంది. ఈ చారిత్రక వేడుక కోసం 100 టన్నుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఆలయం, పరిసరాలను అలంకరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజారోహణం ఎగురువేశారు. సరిగ్గా అభిజిత్ లగ్నంలో ఈ వేడుక జరిగింది. మొత్తం 7 వేల మంది అతిథులు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చారు.

ఉత్తర్ ప్రదేశ్‌లోఅయోధ్యలోని రామమందిరంలో మంగళవారం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. రామ్‌లల్లా గర్భగుడిపై ధర్మ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆవిష్కరించారు. అభిజిత్ లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు కాషాయ జెండాను మోదీ ఎగురవేశారు. దీనికి ముందు గర్భగుడిలోని బాలరాముడికి ప్రధాని మోదీ హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నరామమందిర నిర్మాణం పూర్తయ్యిందనే దానికి సంకేతంగా ధ్వజారోహణవేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సాధువులు, శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు సహా దాదాపు 7వేల మంది ప్రత్యక్షంగా తిలకించారు. రాముడు జన్మస్థలం అయోధ్యంలో భవ్యమైన మందిరం నిర్మాణం జరిగి.. గతేడాది జనవరి 22న బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే.

ఆలయ మొదటి అంతస్తులోని గోపురంపై 42 అడుగుల ఎత్తులో ఈ ధ్వజాన్ని మోదీ ఎగురవేశారు. కాషాయ రంగులో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో లంబకోణ త్రిభుజాకారంలో ఉన్న ఈ ధ్వజంపై రాముడి తేజస్సు, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓంకారం చిహ్నాలను బంగారు దారంతో ఎంబ్రాయిడరీ చేయించారు. ఐక్యత, సాంస్కృతిక వారసత్వం, రామరాజ్య ఆదర్శాలను ఇది ప్రతిబింబిస్తుంది. వాల్మీకి విరచిత రామాయణం ప్రకారం.. మందార, పారిజాత మొక్కలను కశ్యప మహార్షి అంటుకట్టడం ద్వారా ఈ కోవిదార చెట్టు ఆవిర్భవించినట్లు చెబుతారు. ప్రాచీన కాలంలోనే మొక్కల అంటుకట్టే విధానం ఉందనేది దీన్ని బట్టి తెలుస్తోంది.

మార్గశిర పంచమిని వివాహ పంచమిగా పిలుస్తారు. ఈ తిథినాడే సీతారాముల కళ్యాణం జరిగిందని, అభజిత్ లగ్నంలో శ్రీరాముడు కౌసల్య గర్భాన జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ విశిష్టమైన రోజున అదే అభిజిత్‌ లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అహ్మదాబాద్‌లోని పారాచ్యూట్‌ తయారీ సంస్థ ఈ ధ్వజాన్ని తయారుచేసింది. చాలాకాలం పాటు మన్నేలా పారాచ్యూట్‌ గ్రేడ్‌ వస్త్రం, పట్టుదారాలతో 25 రోజుల పాటు శ్రమించి తయారుచేశారు.

ధ్వజారోహణం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం భారతీయ డీఎన్ఏలోనే ఉందని అన్నారు. అంతేకాదు, అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మించాలనే హిందువుల 500 ఏళ్ల నాటి కల నెరవేరిందని పేర్కొన్నారు. ‘‘అయోధ్య తన చరిత్రలో మరో యుగ ఘట్టాన్ని చూస్తోంది… దేశంతో పాటు భూగోళం మొత్తం రాముని భక్తిలో మునిగిపోయింది’’ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ స్వామీజీ గణేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో అయోధ్య, కాశీ, దక్షిణ భారతదేశానికి చెందిన 100 మంది పండితులు చేతులు మీదుగా ఈ కార్యక్రమం సాగింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ayodhya Ram Temple
  • Dhwajarohan
  • narendra modi

Related News

Markapuram Road accident pm modi

Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

Markapuram ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. “ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమా

  • Andhra Pradesh Govt Set To Increase Assembly And Lok Sabha Seats

    Andhra Pradesh Assembly And Lok Sabha Seats: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పెంపు..?

  • Central Government Resolve RDT Foreign Funding Issue

    Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు పునరుద్ధరణ

Latest News

  • Vizag : ప్రియురాలిని చంపి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన ప్రేమికుడు

  • Prakash Raj : ప్రకాశ్ రాజ్ ఇంట విషాదఛాయలు

  • Azharuddin: ఎల్బీ స్టేడియంలో సిక్సులతో చెలరేగిన మంత్రి అజారుద్దీన్..

  • PSL Ball Tampering: పాకిస్థాన్ క్రికెట్‌లో మరో వివాదం.. అడ్డంగా దొరికిపోయిన స్టార్ ప్లేయర్లు..

  • Stock Markets: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd