HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Cyclone Ditva Affects Sri Lanka India Helps

Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

  • By Vamsi Chowdary Korata Published Date - 05:29 PM, Fri - 28 November 25
  • daily-hunt
Sri Lanka
Sri Lanka

దిత్వా తుపాను శ్రీలంకను పెను విధ్వంసం సృష్టిస్తోంది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు. దిత్వా ధాటికి శ్రీలంక ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులు, రైళ్లను నిలిపేశారు. ఈ సమయంలో శ్రీలంకకు సహాయం చేసేందుకు భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను మోహరించింది. ఈ విపత్తుపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండురోజుల్లో ఈ దిత్వా తుపాను భారత్‌ను తాకనుంది.

దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంక అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడటం వల్ల ఇప్పటివరకు 56 మంది మృతి చెందారు. తుపాను కారణంగా శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొండచరియలు విరిగిపడి ఒకే చోట 25 మందికి పైగా మరణించారు. దాదాపు 600 ఇళ్లు దెబ్బతినగా.. 21 మంది గల్లంతయ్యారు. శ్రీలంకలో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. శ్రీలంకవ్యాప్తంగా రైలు సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం శ్రీలంక ఉన్న ఆపద సమయంలో భారత్ ఆపన్నహస్తం అందించింది. సహాయక చర్యల కోసం కొలంబోలో ఉన్న ఐఎన్‌ఎస్ విక్రాంత్ యుద్ధనౌక నుంచి హెలికాప్టర్లను పంపించింది.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను కారణంగా శ్రీలంకవ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. మరోవైపు.. కొండచరియలు విరిగిపడటం వల్ల మరణించిన వారి సంఖ్య 56కి పెరిగింది. ఇందులో మరో 21 మంది గల్లంతయ్యారు. 600కు పైగా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. శ్రీలంక ప్రభుత్వ విపత్తుల నిర్వహణ కేంద్రం ప్రకారం.. మధ్య ప్రాంతంలోని టీ ఉత్పత్తి కేంద్రాలైన బదుల్లా, నువారా ఏలియా జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి 25 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లను మూసివేయాలని శ్రీలంక ప్రభుత్వం ఆదేశించింది.

శ్రీలంకలోని చాలా నదులు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా కెలానీ నది పరీవాహక ప్రాంతంలోని కొలంబోతో సహా లోతట్టు ప్రాంతాలకు రాబోయే 48 గంటల్లో రెడ్ లెవల్ ఫ్లడ్ వార్నింగ్ జారీ చేశారు. శుక్రవారం ఒక్కరోజే 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరించింది.

కొండచరియలు విరిగిపడటం.. బురద, చెట్లు రోడ్లు, రైలు మార్గాలపై పడటంతో పలు ప్రాంతాల్లో రోడ్లు మూతపడ్డాయి. అత్యవసర సేవలు మినహా రైలు సర్వీసులు అన్నింటినీ శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి రద్దు చేశారు. దాదాపు 20,500 మంది సైనిక సిబ్బందిని సహాయక చర్యల కోసం శ్రీలంక ప్రభుత్వం మోహరించింది.

దిత్వా తుఫాను శ్రీలంకలో సృష్టించిన తీవ్ర విధ్వంసంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. దిత్వా తుఫాను కారణంగా తమ వారిని కోల్పోయిన శ్రీలంక ప్రజలకు తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మరోసారి శ్రీలంకకు భారత్.. మొట్టమొదటి సహాయకారిగా నిలిచింది. దిత్వా తుపాను బీభత్సం కారణంగా శ్రీలంక సహాయం కోరగా.. ప్రస్తుతం కొలంబోలో డాక్ చేసి ఉన్న భారత నౌకాదళ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ నుంచి తక్షణమే సహాయక, రెస్క్యూ ఆపరేషన్ల కోసం హెలికాప్టర్లను పంపించారు.

ఈ ఆపత్కాలంలో అండగా నిలిచినందుకు భారత్‌కు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు శ్రీలంక ప్రభుత్వం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది. ఇక ఈ దిత్వా సైక్లోన్.. ఈనెల 30వ తేదీన భారత్‌ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది.

This morning’s visuals from Kandy, Sri Lanka.

Cyclone Ditwah slammed Sri Lanka, triggering flash floods and landslides that have killed at least 46 people, with 23 still missing. video from Akila Uyanwatta. pic.twitter.com/94ppltGqLY

— Weather Monitor (@WeatherMonitors) November 28, 2025

🇮🇳🇱🇰 A heartfelt thank you to India

As Cyclonic Storm Ditwah brings severe weather across Sri Lanka, India has once again stepped forward as a true friend and first responder. The decision to deploy helicopters from INS Vikrant, currently docked in Colombo, to assist our rescue… https://t.co/RokkApbRTG

— Shane Priyawickrama (@SPriyawickrama) November 28, 2025

At least 56 people are dead and 21 missing in Sri Lanka after floods and landslides destroyed homes.

Nearly 44,000 affected as Cyclone Ditwah nears.

Red flood alerts issued for Colombo and Kelani River valley. #SriLanka pic.twitter.com/VLceC0MppE

— BPI News (@BPINewsOrg) November 28, 2025

🇱🇰 RED ALERT: Sri Lanka braces for impact as Deep Depression intensifies into Cyclone Ditwah. 🌀⚠️

A dramatic rescue operation saw the Air Force airlift 3 locals from a rooftop as floods surged.

Situation Report (Nov 27):
🔴 Storm Name: DITWAH .
🕯️ Casualties: 40 Dead, 14… pic.twitter.com/h9EfnRPwQJ

— Tharaka Basnayaka (@Tharaka_) November 27, 2025

EXTREME WEATHER UPDATE⚠️

Death toll from Cyclone Ditwah-related floods and landslides has climbed to 56 since Nov. 17, according to DMC.
14 injured and 21 missing, with 600+ houses partially damaged.
Pray For Sri Lanka🙏🇱🇰

Authorities urge the public to remain vigilant amid… pic.twitter.com/OG9AUiPhZR

— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) November 28, 2025


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cyclone Ditwa Floods
  • Cyclone Ditwah
  • Cyclone Ditwah Effect
  • narendra modi
  • Sri Lanka
  • tweet

Related News

Cyclone Ditwah

Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

Cyclone Ditwah to bring Heavy Rains to AP : ఈ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడం, పాత మరియు బలహీనమైన ఇళ్లలో నివసించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం

  • Dhwajarohan In Ayodhya

    Ayodhya Ram Temple : ప్రధాని చేతుల మీదుగా వైభవంగా ధ్వజారోహణం!

Latest News

  • Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

  • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

  • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

  • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

  • Kutami Government : కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది – పవన్

Trending News

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd