Ap
-
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్రవ్యాప్తంగా 1.30లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు: సీఎం చంద్రబాబు
రాష్ట్రం మొత్తం ఆఫ్‌లైన్, ఆన్లైన్ మార్గాల్లో యోగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 9వ తరగతి నుంచే విద్యార్థులు యోగాను తప్పనిసరిగా అభ్యసించాలి. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్తులో యోగాపై ప్రత్యేక కోర్సులు, శిక్షణా శిబిరాలు మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
Published Date - 04:35 PM, Thu - 19 June 25 -
#Telangana
Uttam Kumar : గోదావరి-బనకచర్ల అంశం..త్వరలో ఇద్దరు సీఎంల భేటీ : మంత్రి ఉత్తమ్‌కుమార్
ఈ సమావేశంలో ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆందోళనలు, న్యాయపరమైన అంశాలను మంత్రి పాటిల్‌కు వివరించినట్లు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. చట్టబద్ధ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమంటే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను విస్మరించడమే అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
Published Date - 03:20 PM, Thu - 19 June 25 -
#Andhra Pradesh
AP : 17 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
ఉత్తర్వుల ప్రకారం, 2025 ఫిబ్రవరి 1 నాటికి అవసరమైన శిక్షను అనుభవించి సత్ప్రవర్తనతో ప్రవర్తించిన ఖైదీలను షరతులతో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆయా ఖైదీల మిగిలిన శిక్షను ప్రభుత్వం మాఫీ చేయనుంది. అయితే, ఇది పూర్తిగా ఒక పునరావాస విధానంగా తీసుకోవాలని, ఖైదీలు నిబంధనలకు లోబడి ప్రవర్తించాలని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Published Date - 06:28 PM, Wed - 18 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ .. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీ పాలసీ తీసుకురావాలి : సీఎం
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీ రూపొందించాలి. రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నుంచి సంపద సృష్టించే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలి అని అధికారులను ఆదేశించారు.
Published Date - 04:46 PM, Tue - 17 June 25 -
#Andhra Pradesh
AP : ఏపీ మహిళలకు శుభవార్త.. ఇకపై వారికి నెలకు రూ 1500.. !
ఇందులో భాగంగా ఏడాదికి రూ. 18,000 మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికై రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,300 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. దీనివల్ల లక్షలాది మంది మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరిగి వారి జీవన స్థాయి మెరుగవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 11:54 AM, Mon - 16 June 25 -
#Andhra Pradesh
Thalliki Vandanam : తల్లికి వందనంపై ఆరోపణలు.. లోకేశ్ క్లారిటీ
Thalliki Vandanam : ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలున్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం/వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేశాకే వారికి నిధులు విడుదలవుతాయి. మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం.. చెయ్య నివ్వం
Published Date - 05:38 PM, Sun - 15 June 25 -
#Andhra Pradesh
AgriGold : అగ్రిగోల్డ్ బాధితులకు తీపి కబురు.. రూ.7 వేల కోట్లకు పైగా ఆస్తుల పునరుద్ధరణకు కోర్టు అనుమతి
ఈ పరిణామం పట్ల బాధితులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వారు న్యాయం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది పెట్టుబడిదారులు అగ్రిగోల్డ్ కంపెనీ మోసపూరిత కార్యకలాపాల వల్ల తీవ్రంగా నష్టపోయారు.
Published Date - 10:50 AM, Sat - 14 June 25 -
#Andhra Pradesh
Chandrababu P4 Policy : పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్న లక్ష్యమే ‘P4 ‘
Chandrababu : “పీ4 విధానం ఒక విప్లవాత్మక చర్య, ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. గతంలో జన్మభూమి కార్యక్రమం లాంటి ప్రజా స్పందనను ఇది కూడా పొందుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
Published Date - 12:03 PM, Fri - 13 June 25 -
#Andhra Pradesh
Thalliki Vandanam : విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ: టీడీపీ
ఇందులో భాగంగా ఇద్దరు పిల్లలు ఉన్న ఓ లబ్ధిదారుడి ఖాతాలో రూ.26,000 జమైనట్టు తెలిపింది. దీనిని ఆధారంగా తీసుకొని వచ్చిన బ్యాంక్ మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను కూడా టీడీపీ షేర్ చేసింది. అదేవిధంగా మరో రూ.4,000 పాఠశాల అభివృద్ధి ఖాతాలో జమ అయినట్లు పేర్కొంది.
Published Date - 11:19 AM, Fri - 13 June 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణానికి ఏడాది.. జనసేన ఆసక్తికరమైన వీడియో
ఈ వీడియోలో పవన్ కల్యాణ్ పరిపాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలను హైలైట్ చేశారు. అందులో ప్రతి ఇంటికీ తాగునీరు చేరాలన్న సంకల్పంతో చేపట్టిన చర్యలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా 39 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, అడవుల్లో పని చేసే కుంకీ ఏనుగులను తిరిగి ప్రవేశపెట్టడం వంటి విభిన్న చర్యలు ప్రస్తావించారు.
Published Date - 12:59 PM, Thu - 12 June 25 -
#Andhra Pradesh
Heavy rains : ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అధిక వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. APSDMA విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
Published Date - 04:03 PM, Wed - 11 June 25 -
#Andhra Pradesh
Ntr Bharosa Pension Scheme : ఏపీలో కొత్త వితంతు పింఛన్లు మంజూరు..నెలకు రూ.4వేలు
ప్రభుత్వ కూటమి ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా, ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.29.60 కోట్లు విడుదల చేసింది. ఈ పథకం కింద భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి స్పౌజ్ పింఛన్ విధానం అమలులోకి వచ్చింది.
Published Date - 02:35 PM, Wed - 11 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థ : సీఎం చంద్రబాబు
ఎన్విడియా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ, పరిశోధన, స్టార్టప్‌ల అభివృద్ధి వంటి అంశాల్లో సమగ్ర కార్యాచరణ అమలులోకి రానుంది. రాబోయే రెండేళ్లలో దశలవారీగా 10 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Published Date - 12:52 PM, Sat - 7 June 25 -
#Andhra Pradesh
Cabinet Meeting : ఈ నెల 19న ఏపీ కేబినెట్ భేటీ..పలుకీలక అంశాలపై చర్చ
ప్రభుత్వం ముందుగా తీసుకున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, అలాగే ముఖ్యమైన ప్రజా సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో మంత్రిమండలి సమగ్రంగా చర్చించనుంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం పునరుద్ధరించిన అమరావతి రాజధాని నిర్మాణం ప్రధాన అజెండాగా ఉన్న నేపథ్యంలో, దీనిపై ప్రత్యేక చర్చ జరిగే అవకాశముంది.
Published Date - 10:53 AM, Sat - 7 June 25 -
#Andhra Pradesh
Banakacherla Project : దయచేసి తెలంగాణ అర్థం చేసుకోవాలి – నిమ్మల రామానాయుడు
Banakacherla Project : రాయలసీమకు నీరు అందించేందుకు హంద్రీనీవా, బుడమేరులో పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే పంటకాలానికి తగిన సూచనలతో పాటు మద్దతు ధరలు ప్రకటించనున్నట్లు
Published Date - 08:52 AM, Sat - 7 June 25