Andhra Pradesh CM Chandrababu Naidu
-
#Andhra Pradesh
AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు, కంపెనీలు క్యూ కట్టాయి. మిట్టల్ స్టీల్, గూగుల్ డేటా సెంటర్, యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు సహా ఎన్నో పెట్టుబడులు వచ్చాయి. వీటితో పాటుగా ఏపీకి బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) పెట్రో కెమికల్ కాంప్లెక్స్, గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ కూడా ఏర్పాటు కాబోతోంది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో ఈ కాంప్లెక్స్, రిఫైనరీ ఏర్పాటు చేయనుండగా.. తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. […]
Date : 21-05-2026 - 11:01 IST -
#Andhra Pradesh
CBN In Kuppam: రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు దంపతుల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి గ్రామీణ జీవనశైలికి, సామాన్య ప్రజలకు తాము ఎంత దగ్గరో నిరూపించే ఒక అరుదైన, ఆహ్లాదకరమైన క్షణాన్ని పంచుకున్నారు. ఈరోజు కుప్పం పర్యటనకు వెళ్తున్న క్రమంలో, రహదారి పక్కన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద సీఎం దంపతుల వాహనం ఆగింది. వారు స్వయంగా కారు దిగి, వారి వద్ద తాటి ముంజలను కొనుగోలు చేయడమే కాకుండా, అక్కడే నిలబడి ఎంతో ఆప్యాయంగా తింటూ ముచ్చటించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి […]
Date : 20-05-2026 - 5:20 IST -
#Andhra Pradesh
CM Chandrababu: మత్స్యకారులకు అండగా : సీఎం చంద్రబాబు
మత్స్యకారుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంటలో నేడు జరిగిన ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వేట నిషేధ భృతి కింద రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ. 20 వేల చొప్పున, మొత్తం రూ. 262 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లోకి […]
Date : 19-05-2026 - 1:47 IST -
#Andhra Pradesh
CM Chandrababu Naidu: దేశ భవిష్యత్తు కోసం చంద్రబాబు భారీ వ్యూహం…!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర వేదికగా జనాభా విధానంపై సంచలన ప్రకటన చేశారు. ఒకప్పుడు జనాభా నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన చంద్రబాబు.. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు పిల్లలు భారం కాదు..భవిష్యత్తు సంపద అంటూ సరికొత్త వ్యూహానికి తెరలేపారు. రాష్ట్రంలో పనిచేసే వయసు గల జనాభా అంటే 15-64 ఏళ్ల మధ్య జనాభా ఎక్కువగా ఉండటాన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. అయితే, ఏపీలో […]
Date : 18-05-2026 - 1:29 IST -
#Andhra Pradesh
Cm Chandrababu: ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రభుత్వ దార్శనికతను, భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు. తన మనసుకు దగ్గరైన నాలుగు కార్యక్రమాలే రాష్ట్ర భవిష్యత్తుకు మూలస్తంభాలని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చే ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’, పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలు, జనాభా సమతుల్యత, భూ రికార్డుల ప్రక్షాళన తన జీవితాశయమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్రాన్ని […]
Date : 16-05-2026 - 3:34 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు..
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, మూడు విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న మొత్తం 629 ఏఈఈ పోస్టుల భర్తీకి నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యుత్ సంస్థలు తుది నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఇంధన శాఖ […]
Date : 16-05-2026 - 12:00 IST -
#Andhra Pradesh
Cm chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : సీఎం చంద్రబాబు
ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు నెలవైన పుట్టపర్తి గడ్డపై దేశ రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. దేశీయ పరిజ్ఞానంతో ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారుచేసే ప్రతిష్ఠాత్మక అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA – ఆమ్కా) ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు […]
Date : 15-05-2026 - 4:25 IST -
#Andhra Pradesh
AMCA Fighter Jet Project: పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన
రాయలసీమకు మరో భారీ ప్రాజెక్టు వచ్చింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్లతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరికొన్ని ప్రాజెక్టులకు పుట్టపర్తి నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. రాయలసీమ ప్రాంతంలో యుద్ధ […]
Date : 15-05-2026 - 2:01 IST -
#Andhra Pradesh
Amaravati: అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం
ఏపీ రాజధాని అమరావతిలో 4,618 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్లాన్ చేశారు. తాడికొండ మండలం రావెల సమీపంలో స్థలం గుర్తించినట్లు తెలుస్తోంది. అక్కడ గ్రామాల్ని తరలించకుండా స్థల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భూసమీకరణా, సేకరణా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ను తొలి దశలో రూ.3,409 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనే ఈ ఎయిర్‌పోర్ట్ స్థలాన్ని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధిపై దృష్టి […]
Date : 15-05-2026 - 11:27 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీ వర్సిటీల్లో 1523 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 1,523 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి అనుమతిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా ఈ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేడే విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆమోదించిన 1,523 పోస్టుల్లో 1,244 రెగ్యులర్ పోస్టులు కాగా, 279 బ్యాక్‌లాగ్ పోస్టులు […]
Date : 15-05-2026 - 9:47 IST -
#Andhra Pradesh
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇంధన సంక్షోభాన్ని నివారించే ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అంశంపై ఏపీ సర్కార్ తీవ్రంగా యోచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రాచుర్యం పొందిన ఈ విధానం, మళ్లీ ఇప్పుడు యుద్ధ పరిస్థితుల కారణంగా తెరపైకి వచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం […]
Date : 14-05-2026 - 10:25 IST -
#Andhra Pradesh
Puttaparthi: సీమకు రాయల్ కల…. పుట్టపర్తిలో AMCA గర్జన!
పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది. కొంతకాలంగా భారీ పెట్టుబడులు ఒక్కొక్కటిగా రాయలసీమలో అడుగుపెడుతున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకతో సీమ రూపురేఖలు మారబోతుండగా, మరోవైపు పుట్టపర్తి వేదికగా దేశ రక్షణ రంగంలోనే అత్యంత కీలకమైన AMCA ప్రాజెక్టుకు అడుగులు పడుతుండటం సంచలనంగా మారింది. రాయలసీమను ఆటోమొబైల్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యం దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు సత్ఫలితాలనిస్తున్నాయి. కియా మోటార్స్ సృష్టించిన ప్రకంపనల తర్వాత, ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు […]
Date : 13-05-2026 - 12:40 IST -
#Andhra Pradesh
కడపలో అల్లర్ల వెనుక వైసీపీ స్కెచ్…. కూటమి సర్కార్‌పై కుట్ర…!!
కడపలో అకస్మాత్తుగా చెలరేగిన అల్లర్ల వెనుక వైసీపీ నాయకుల పక్కా ప్రణాళిక ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అల్మాస్‌పేట సర్కిల్ పేరు మార్పు అంశాన్ని సాకుగా చూపి, స్థానిక యువతను రెచ్చగొట్టి వీధుల్లోకి తెచ్చారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపని వైసపీ నేతలు, ఇప్పుడు కావాలనే తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అశాంతికి తెరలేపారు. ఈ హింసాకాండలో పాల్గొన్న వారంతా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రధాన అనుచరులని […]
Date : 13-05-2026 - 12:31 IST -
#Andhra Pradesh
TDP: రాజ్యసభకు టీడీపీ నుంచి భారీగా ఆశావహుల
ఏపీలో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి నెల ముందే మొదలైంది. వచ్చే నెలలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో తమ పేరు పరిశీలించాలంటూ వినతులు మొదలయ్యాయి. టీడీపీలో భారీగా ఆశావహులు ఉన్నారు. మిత్రపక్షాలకు ఎన్ని ఇస్తారన్నదానిపైనే టీడీపీ నేతలకు కేటాయింపు ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ నుంచి రేసులో ఏకంగా 8 మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి ముందే మొదలవుతోంది. వచ్చే నెలలో 4 […]
Date : 13-05-2026 - 11:30 IST -
#India
Suvendu Adhikari: నేడే సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక మలుపు. దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టులు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఏలిన బెంగాల్ గడ్డపై మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడం జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సువేందు అధికారి బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను తెలియజేసిన సువేందు అధికారి, కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా […]
Date : 09-05-2026 - 11:21 IST