Yuvraj Singh New Flat: కోహ్లీ ఉండే భవనంలో కొత్త ఇంటిని కొనేసిన యువరాజ్ సింగ్.. ధరెంతో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు..!
యువరాజ్ సింగ్- హాజెల్ కీచ్ ముంబైలో తమ కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ఫ్లాట్‌లు ఉన్న భవనంలోనే యువీ ఫ్లాట్ తీసుకున్నాడు. యువీ ఫ్లాట్ 29వ అంతస్తులో ఉండగా, కోహ్లీ ఈ భవనంలోని 35వ అంతస్తులో నివసిస్తున్నాడు.
- By Gopichand Published Date - 11:45 AM, Sat - 5 October 24

Yuvraj Singh New Flat: టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh New Flat), భార్య హాజెల్ కీచ్ మాయానగరిలో తమ కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. యువీకి చెందిన ఈ విలాసవంతమైన ఫ్లాట్ అదే భవనంలో ఉంది. ఇందులో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ కూడా ఫ్లాట్ కలిగి ఉన్నారు. యువరాజ్ కొనుగోలు చేసిన ఈ కొత్త ఫ్లాట్ ధర 64 కోట్లు అని తెలుస్తోంది. యువీ ఈ ఫ్లాట్ అనేక సౌకర్యాలను కలిగి ఉంది. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
యువరాజ్ కొత్త ఇల్లు కొన్నాడు
యువరాజ్ సింగ్- హాజెల్ కీచ్ ముంబైలో తమ కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు ఫ్లాట్‌లు ఉన్న భవనంలోనే యువీ ఫ్లాట్ తీసుకున్నాడు. యువీ ఫ్లాట్ 29వ అంతస్తులో ఉండగా, కోహ్లీ ఈ భవనంలోని 35వ అంతస్తులో నివసిస్తున్నాడు. యువరాజ్, హాజెల్ కొత్త ఫ్లాట్ లివింగ్ రూమ్ అందమైన పెయింటింగ్స్‌తో ఉన్నట్ల తెలుస్తోంది. యువీ ప్రత్యేక అభ్యర్థన మేరకు ఇంటీరియర్ డిజైనర్ ఫ్లాట్ మూలల్లో అద్భుతమైన డిజైన్ చేసినట్లు సమాచారం. యువీ బాల్కనీ నుండి ముంబై నగరం ఉత్తమ వీక్షణను చూడవచ్చు. యువీ- హాజెల్‌లకు ఆటలంటే చాలా ఇష్టం.. వారి భవనంలో ప్రత్యేక గేమ్‌ల జోన్ ఉంది.
బెడ్ రూమ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు
యువరాజ్- హాజెల్‌ల కొత్త ఫ్లాట్‌లోని బెడ్‌రూమ్ చూడదగ్గది. పడకగదిలో మెరిసే పాలరాయిని ఉపయోగించారు. గోడలకు ఆఫ్-వైట్ రంగులు వేసి అద్భుతమైన డిజైన్లను రూపొందించారు. యువరాజ్ ఫ్లాట్ ధర రూ. 64 కోట్లు అని, ఇది విరాట్ కోహ్లీ ఇంటి ధర కంటే దాదాపు రెట్టింపు అని సమాచారం. ఒకే భవనంలో ఉన్నప్పటికీ కోహ్లీ ఫ్లాట్ ధర రూ.34 కోట్లు.
యువరాజ్‌కు చాలా చోట్ల ఇండ్లు ఉన్నాయి
ముంబై మాత్రమే కాదు యువరాజ్ సింగ్‌కు చాలా చోట్ల విలాసవంతమైన ఇళ్ళు ఉన్నాయి. డీఎల్ఎఫ్ సిటీలో ఉన్న గురుగ్రామ్‌లో యువీకి ప్రత్యేక ఆస్తి కూడా ఉంది. ఇక్కడ కూడా యువరాజ్ విరాట్ కోహ్లీకి పొరుగువాడు. టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌కి ఢిల్లీలోని ఛతర్‌పూర్‌లో 5 BHK పెంట్‌హౌస్ కూడా ఉంది. ఇది కాకుండా యువరాజ్‌కు పంచకులలో అద్భుతమైన బంగ్లా కూడా ఉంది. పెళ్లి సమయంలో యువీ ఇంట్లో డోలీ వేడుక కూడా నిర్వహించారు.