Dhruv Jurel: టీమిండియాకు గుడ్ న్యూస్.. పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన కీలక ఆటగాడు!
భారత జట్టులో ఎన్. జగదీశన్‌ను కూడా వికెట్ కీపర్‌గా అవకాశం ఇచ్చారు. అయితే, అతను ఆడే అవకాశం తక్కువగా ఉంది. ఎందుకంటే జురెల్ ఇంతకు ముందు భారత్ తరపున టెస్ట్ ఆడాడు.
- By Gopichand Published Date - 06:30 PM, Wed - 30 July 25

Dhruv Jurel: భారత్-ఇంగ్లండ్ సిరీస్‌లో భాగంగా ఐదవ టెస్ట్ మ్యాచ్ జూలై 31న లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత మెంటార్ గౌతమ్ గంభీర్.. గాయం కారణంగా తప్పుకున్న రిషభ్ పంత్ స్థానంలో ఏ వికెట్ కీపర్ ఆడబోతున్నారో స్పష్టం చేశారు.
పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్‌కు అవకాశం
నాలుగో టెస్ట్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడుతూ గాయపడిన రిషభ్ పంత్, ఐదవ టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో గంభీర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండబోతున్నట్లు ప్రకటించారు. జురెల్ బాల్య కోచ్ పరవేందర్ యాదవ్ ప్రకారం.. గంభీర్ స్వయంగా జురెల్‌తో మాట్లాడి ‘అవకాశం వస్తుంది, సిద్ధంగా ఉండు’ అని చెప్పినట్లు పేర్కొన్నారు.
Also Read: ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. భారీగా లాభపడిన పంత్, జడేజా
జురెల్ ఎంపికకు కారణాలు
ఈ సిరీస్‌లో పంత్ స్థానంలో జురెల్ ఇప్పటికే వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అంతేకాకుండా, తన బ్యాటింగ్‌తో కూడా ఆకట్టుకున్నాడు. ఈ కారణంగా ఐదవ టెస్ట్‌లో అతడికే అవకాశం లభించనుంది. భారత జట్టులో మరో వికెట్ కీపర్‌గా ఎన్. జగదీశన్ ఉన్నప్పటికీ అతడు జట్టులో కొత్తగా చేరాడు. దీంతో అతనికి తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
జగదీశన్‌కు కూడా ఛాన్స్?!
భారత జట్టులో ఎన్. జగదీశన్‌ను కూడా వికెట్ కీపర్‌గా అవకాశం ఇచ్చారు. అయితే, అతను ఆడే అవకాశం తక్కువగా ఉంది. ఎందుకంటే జురెల్ ఇంతకు ముందు భారత్ తరపున టెస్ట్ ఆడాడు. అంతేకాకుండా ఇంగ్లండ్ పర్యటనలో పంత్ స్థానంలో అనేక సందర్భాలలో వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. అతను తన బ్యాటింగ్‌తో కూడా గణనీయంగా ఆకట్టుకున్నాడు, అయితే జగదీశన్‌కు భారత జట్టులో మొదటిసారి అవకాశం లభించింది.