Jaiswal Faces Rohit Wrath: మూడు సులువైన క్యాచ్‌లను వదిలేసిన జైస్వాల్.. రోహిత్ రియాక్షన్ ఇదే!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ క్యాచ్‌లను డ్రాప్ చేశాడు. మొదట ఖవాజా, తర్వాత మార్నస్ లాబుస్‌చాగ్నే క్యాచ్ మిస్ చేసిన జైస్వాల్ ఆ తర్వాత పాట్ కమిన్స్ క్యాచ్ వదిలేశాడు.
- By Gopichand Published Date - 12:21 PM, Sun - 29 December 24

Jaiswal Faces Rohit Wrath: క్రికెట్ ఫీల్డ్‌లో చురుకుదనం చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు కష్ట సమయాల్లో కష్టంతో పాటు అదృష్టం కూడా అవసరం. ఫీల్డర్లు సాధారణ క్యాచ్‌లను వదులుకోవడం తరచుగా మ్యాచ్‌లలో కనిపిస్తుంది. దాని ప్రయోజనాన్ని ప్రత్యర్థి జట్టులోని ఆటగాడు ఉపయోగించుకుంటాడు. మెల్‌బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఇలాంటిదే కనిపించింది. ఇక్కడ భారత జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఘోరంగా విఫలమయ్యాడు.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం సెషన్‌లో యశస్వి జైస్వాల్ మూడు క్యాచ్‌లను వదులుకోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం (Jaiswal Faces Rohit Wrath) చేశాడు. నాలుగో రోజు ఆటలో రెండో సెషన్ వరకు యశస్వి జైస్వాల్ మొత్తం 3 పెద్ద క్యాచ్‌లను వదిలేశాడు. ఉస్మాన్ ఖవాజా క్యాచ్‌ను యశస్వి మొదట జారవిడిచాడు. దీని తర్వాత అతను మార్నస్ లాబుస్‌చాగ్నే, పాట్ కమిన్స్‌ల సులువైన క్యాచ్‌లను కూడా తీసుకోలేకపోయాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ మైదానం మధ్యలో సహనం కోల్పోయి చాలా కోపంగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. అంతేకాకుండా జైస్వాల్‌కు రోహిత్ క్లాస్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
— The Game Changer (@TheGame_26) December 29, 2024
వాస్తవానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ క్యాచ్‌లను డ్రాప్ చేశాడు. మొదట ఖవాజా, తర్వాత మార్నస్ లాబుస్‌చాగ్నే క్యాచ్ మిస్ చేసిన జైస్వాల్ ఆ తర్వాత పాట్ కమిన్స్ క్యాచ్ వదిలేశాడు. దీంతో రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అంతేకాకుండా రోహిత్ చాలా కోపంగా కనిపించాడు. ఇప్పుడు యశస్వి తప్పిదానికి భారత జట్టు ఎలాంటి పరిణామాలు చవిచూడాల్సి వస్తుందోనని ప్రతి భారతీయ అభిమాని భయపడుతున్నాడు.
అయితే లాబుస్‌చాగ్నే 70 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ పాట్ కమిన్స్ 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త రాసేసమయానికి ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి 311 పరుగులు ఆధిక్యంలో నిలిచింది. ఒక వేళ యశస్వి ఆ క్యాచ్‌లను పట్టి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని క్రీడా పండితులు తమ అభిప్రాయాలను చెబుతున్నారు.