Minister Komatireddy Venkat Reddy: మొన్న రేవతి కుటుంబానికి.. నేడు విద్యార్థి చదువు కోసం ముందుకొచ్చిన మంత్రి!
ఆదివారం ఉదయం ఇంటికి పిలిపించుకొని లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. డబ్బు అందించడమే కాదు.. ప్రణవి చదువుకు అండగా ఉంటా అంటూ భరోసా ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్ధి చదువు ఆగిపోతే వారి జీవితం ఆగిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
- By Gopichand Published Date - 12:03 PM, Sun - 29 December 24

Minister Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన మంత్రిగానే కాకుండా తనలో ఉన్న దాతృత్వాన్ని కూడా ఈ మధ్యకాలంలో బయటపెడుతున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో మృతిచెందిన రేవతి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి తన సొంతంగా రూ. 25 లక్షలను ప్రకటించి ఆ చెక్‌ను వెంటనే రేవతి భర్త భాస్కర్‌కు అందించారు. ఆ ఘటన మరువకముందే మరో చదువుల తల్లికి నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చి ఇటలీ వెళ్లేందుకు సాయం చేశారు.
సార్.. నాకు ఇటలిలోని ప్రఖ్యాత విద్యాసంస్థ పాలిటెన్సికో డి టోరినో (పాలిటో)లో ఆర్కిటెక్చర్ కన్ స్ట్రక్షన్ లో మాస్టర్స్ లో సీటోచ్చింది. కానీ ఆర్ధికంగా మా కుటుంబం అంత భరించేస్థితిలో లేదు సర్ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రణవి చొల్లేటి అనే విద్యార్ధిని ఇటీవల విన్నవించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి తన దాతృత్వాన్ని చాటారు.
Also Read: Boy Rescued : మధ్యప్రదేశ్‌లోని గుణలో బోరుబావిలో పడ్డ బాలుడి రెస్క్యూ.. ఆస్పత్రిలో మృతి ?
ఈరోజు అంటే ఆదివారం ఉదయం ఇంటికి పిలిపించుకొని లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. డబ్బు అందించడమే కాదు.. ప్రణవి చదువుకు అండగా ఉంటా అంటూ భరోసా ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్ధి చదువు ఆగిపోతే వారి జీవితం ఆగిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభ కలిగిన ఏ విద్యార్ధి చదువు ఆగిపోకుడదని తెలిపిన ఆయన.. జీవితాలను మార్చే ఆయుధం చదువు ఒక్కటేనని అన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహాయంపై ప్రణవి ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి నా పరిస్థితి ఇలా ఉందని తెలియగానే.. స్పందించి నువ్వెం భయపడకు ప్రణవి, నేనున్నా అని భరోసా ఇచ్చారని ఆమె తెలిపింది. ఈ రోజు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి అందించిన తోడ్పాటుతో ఉన్నత చదువులు పూర్తి చేసి జీవితంలో స్థిరపడి నాలాంటి వాళ్లకు తోడుగా ఉంటానని ఈ సందర్భంగా ప్రణవి తెలిపారు. ఇప్పటికే ప్రతిభ కలిగి, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఎందరో విద్యార్ధులకు మంత్రి కోమటిరెడ్డి సహాయ సహాకారాలు అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.