విదేశీ ఆటగాడు అంటూ కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కోహ్లీ!
ఆ వీడియోలో మిస్టర్ నాగ్స్ కోహ్లీని సరదాగా ఇలా ఒక క్వశ్చన్ అడిగాడు. ఈ సీజన్లో ఆర్సీబీ ఐదుగురు విదేశీ ఆటగాళ్లతో ఆడుతోందని జనం అంటున్నారు.
- Author : Gopi
Date : 04-04-2026 - 5:10 IST
Published By : Hashtagu Telugu Desk
Kohli: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ 2026లో అదరగొడుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్న కోహ్లీ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే SRHపై 69 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో అందరి మనసు గెలుచుకున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరగనున్న మ్యాచ్‌లో కోహ్లీ తలపడనున్నారు. అయితే ఈ మ్యాచ్‌కంటే ముందే తనను ‘విదేశీ ఆటగాడు’ అని పిలుస్తున్న విమర్శకులకు కింగ్ కోహ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
‘విదేశీ ఆటగాడు’ అన్న వ్యాఖ్యలపై కోహ్లీ స్పందన
నిజానికి కోహ్లీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లండన్‌లో నివసిస్తున్నాడు. సిరీస్‌లు లేదా టోర్నమెంట్లకు కొద్ది రోజుల ముందు మాత్రమే భారత్‌కు వచ్చి అవి ముగియగానే తిరిగి లండన్ వెళ్ళిపోతుంటాడు. ఈ కారణంగా సోషల్ మీడియాలో తరచుగా ఆయనపై మీమ్స్ వస్తుంటాయి. కొందరు నెటిజన్లు ఆయన లండన్ షిఫ్ట్ అవ్వడంపై సెటైర్లు వేస్తూ ‘విదేశీ ఆటగాడు’ అని కూడా పిలుస్తుంటారు. దీనిపై ఆర్సీబీ విడుదల చేసిన ఒక వీడియోలో కోహ్లీ స్పందించాడు.
Also Read: Harish Rao: కేసీఆర్ ఆఫీసు మీద దాడి.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
VIRAT KOHLI SPECIAL INTERVIEW ON RCB 😂🔥 pic.twitter.com/e5DCoAgs4A
— Johns. (@CricCrazyJohns) April 4, 2026
ఆ వీడియోలో మిస్టర్ నాగ్స్ కోహ్లీని సరదాగా ఇలా ఒక క్వశ్చన్ అడిగాడు. ఈ సీజన్లో ఆర్సీబీ ఐదుగురు విదేశీ ఆటగాళ్లతో ఆడుతోందని జనం అంటున్నారు. వాళ్లు ఎందుకు అలా అంటున్నారో నాకు అర్థం కావడం లేదు? అని నాగ్స్ అడుగుతాడు. ఈ ప్రశ్న వినగానే కోహ్లీ నవ్వుతూ, తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావో నాకు తెలియదు, వెళ్లి ఆ విదేశీ ఆటగాళ్లనే అడుగు. నేనేం విదేశీ ఆటగాడిని కాదు అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత హోస్ట్‌ను ఉద్దేశించి.. “నేనేమైనా నీకు విదేశీ ఆటగాడిలా కనిపిస్తున్నానా?” అని తిరిగి ప్రశ్నించారు. దానికి హోస్ట్ కూడా నవ్వుతూ “ఖచ్చితంగా కాదు!” అని బదులిచ్చాడు.
ఐపీఎల్ 2025 టైటిల్ విజయంపై జ్ఞాపకాలు
అదే సమయంలో “ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన తర్వాత ఎలా అనిపించింది?” అని కోహ్లీని అడిగాడు. దీనికి సమాధానంగా కోహ్లీ మాట్లాడుతూ.. మేము ఈ ట్రోఫీ కోసం చాలా కాలంగా ఎదురుచూశాం. గెలిచిన తర్వాత మనసు చాలా తేలికగా అనిపించిందిష అని చెప్పుకొచ్చాడు.
విరాట్ ఇంకా మాట్లాడుతూ.. “విజయం అనేది కఠిన శ్రమ, త్యాగం, ఆట పట్ల ఉన్న అంకితభావానికి దక్కిన ప్రతిఫలం. మీ కష్టం వృథా కాలేదని చెప్పడానికి ఇదొక రివార్డ్ లాంటిది. ఓటమి నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు, కానీ నిరంతర కృషి తర్వాత లభించే విజయం భవిష్యత్తులో ఇంకా మెరుగ్గా రాణించడానికి ప్రేరణనిస్తుంది” అని చెప్పుకొచ్చాడు.