Shivalik Sharma: అత్యాచారం కేసులో ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ అరెస్ట్.. ఎవరీ శివాలిక్ వర్మ?
శివాలిక్ శర్మను హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ గత సంవత్సరం (2024) ఐపీఎల్‌లో తమ జట్టులోకి తీసుకుంది. అతన్ని 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు.
- Author : Gopichand
Date : 06-05-2025 - 3:39 IST
Published By : Hashtagu Telugu Desk
Shivalik Sharma: ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ శివాలిక్ శర్మ (Shivalik Sharma)ను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని భగతాసని హౌసింగ్ బోర్డ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఐపీఎల్ మాజీ క్రికెటర్‌పై అతని స్నేహితురాలు అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు చేసిన యువతికి శివాలిక్‌తో నిశ్చితార్థం కూడా జరిగినట్లు సమాచారం.
క్రికెటర్ శివాలిక్ శర్మ, ఆరోపణలు చేసిన యువతి మధ్య స్నేహం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మొదలైంది. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది. ఈ సమయంలో శివాలిక్ ఆమెను కలవడానికి జోధ్‌పూర్‌కు చాలాసార్లు వచ్చాడు. శివాలిక్ వివాహం చేసుకుంటానని వాగ్దానం చేశాడు. వారి మధ్య నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, శివాలిక్ వివాహం హామీ ఇచ్చి శారీరక సంబంధాలు కొనసాగించాడని యువతి ఆరోపించింది.
సుమారు ఒక సంవత్సరం కలిసి ఉన్న తర్వాత శివాలిక్ కుటుంబ సభ్యులు వివాహానికి నిరాకరించారని బాధితురాలు తెలిపింది. దీంతో ఆ యువతి శివాలిక్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసింది. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో శనివారం శివాలిక్‌ను వడోదరలోని అట్లాద్రా థానా పరిధిలో అరెస్టు చేశారు. అతన్ని జోధ్‌పూర్ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత అతన్ని న్యాయస్థాన హిరాసత్‌లోకి పంపారు.
Also Read: India-Pakistan Tension: భారత్- పాక్ మధ్య యుద్ధం జరిగితే భారీగా ప్రాణ నష్టం?
ముంబై ఇండియన్స్ జట్టులో శివాలిక్ శర్మ
శివాలిక్ శర్మను హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ గత సంవత్సరం (2024) ఐపీఎల్‌లో తమ జట్టులోకి తీసుకుంది. అతన్ని 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. అయితే అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ సంవత్సరం (ఐపీఎల్ 2025) అతను ఏ జట్టులోనూ భాగం కాదు. డొమెస్టిక్ టోర్నమెంట్లలో బరోడా క్రికెట్ జట్టు తరపున ఆడే శివాలిక్ 18 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 1087 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 5 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. లిస్ట్ ఎలో ఆడిన 13 మ్యాచ్‌లలో అతను 322 పరుగులు చేశాడు. అతను 19 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఇందులో 349 పరుగులు చేశాడు. అతను తన ఆఖరి మ్యాచ్‌ను ఈ సంవత్సరం జనవరిలో రంజీ ట్రోఫీలో ఆడాడు. జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను 64, 18 పరుగులు చేశాడు.