టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత, స్పందించిన భారత ప్రభుత్వం!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఐసీసీకి రెండో లేఖను పంపింది. అందులో టీ20 వరల్డ్ కప్‌ను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని వారు కోరారు.
- Author : Gopichand
Date : 09-01-2026 - 1:55 IST
Published By : Hashtagu Telugu Desk
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌కు వచ్చి ఆడేందుకు నిరాకరించింది. అయితే, భద్రత విషయంలో పూర్తి హామీ ఇస్తామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా తన తొలి ప్రతిచర్యను తెలియజేసింది.
భారత ప్రభుత్వం ఏమందంటే?
టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. భారత ప్రభుత్వం ప్రతి దేశం నుండి వచ్చే క్రీడాకారులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. బంగ్లాదేశ్ కోసం ప్రత్యేక ట్రీట్మెంట్ ఏదీ ఉండదు కానీ, వారి భద్రతను మాత్రం పూర్తిగా పర్యవేక్షిస్తామని అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌తో ఉన్న పరిస్థితులు వేరని, వారి విషయంలో వేరే విధానం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాకిస్థాన్‌తో భారత్ ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదు. జట్లు ఒకరి దేశానికి మరొకరు వెళ్లరని స్పష్టం చేసింది.
Also Read: బిఆర్ఎస్ కు లభించిన మరో అస్త్రం! కాంగ్రెస్ కు మరో తలనొప్పి తప్పదా ?
🚨 Uncertainty over Bangladesh’s World Cup participation has left players and staff anxious.
“We are here for cricket and what is bigger than a WC? I hope the matter gets resolved soon,” a member of the coaching staff said. pic.twitter.com/ybN0QtC9uz
— Cricbuzz (@cricbuzz) January 9, 2026
BCCI- PCBలకు ఈ విషయాలు తెలుసు. బంగ్లాదేశ్ టీమ్ విషయానికి వస్తే వారికి కావాల్సిన భద్రతను ప్రభుత్వం కల్పిస్తుంది. టోర్నమెంట్లో పాల్గొనేందుకు వచ్చే అన్ని దేశాలకు భారత్ ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు భారత్‌కు రావాలా వద్దా అనేది బంగ్లాదేశ్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ICCకి బంగ్లాదేశ్ రెండో లేఖ
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఐసీసీకి రెండో లేఖను పంపింది. అందులో టీ20 వరల్డ్ కప్‌ను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని వారు కోరారు. భారత్‌లో ఆడేందుకు తమకు ఉన్న సమస్యలేంటో కూడా ఆ లేఖలో వివరించారు. బంగ్లాదేశ్ క్రీడా మంత్రి ఆసిఫ్ నజ్రుల్‌తో చర్చించిన తర్వాతే BCB ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే భద్రతకు సంబంధించి అసలు సమస్యలేంటో స్పష్టంగా తెలియజేయాలని ఐసీసీ బంగ్లాదేశ్ బోర్డును కోరింది.