HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >What If It Rains During The India Vs England Second Semi Final

భార‌త్‌- ఇంగ్లాండ్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు?

ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే సూపర్-8 పాయింట్ల పట్టిక ఆధారంగా ఫైనల్‌కు వెళ్లే జట్టును నిర్ణయిస్తారు.

  • Author : Gopichand Date : 05-03-2026 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India vs England
India vs England

India vs England: 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మొదటి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. నేడు గెలిచిన జట్టు మార్చి 8న జరగబోయే ఫైనల్‌లో కివీస్‌తో తలపడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే ఫైనలిస్ట్ జట్టును ఎలా నిర్ణయిస్తారు? ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

వర్షం పడితే ఫైనల్‌కు వెళ్లేది ఎవరు?

భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ వర్షం లేదా ఇతర కారణాల వల్ల రద్దయితే ‘రిజర్వ్ డే’ నిబంధన అమలులో ఉంటుంది. అంటే ఈరోజు (మార్చి 5) సెమీఫైనల్ మ్యాచ్ జరగకపోతే దానిని రిజర్వ్ డే అయిన మార్చి 6న నిర్వహిస్తారు. ఐసీసీ (ICC) నిబంధనల ప్రకారం.. 2026 టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల కోసం రిజర్వ్ డేని కేటాయించారు. అలాగే ఒకవేళ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా జరగకపోతే దానిని మరుసటి రోజు అంటే మార్చి 9న నిర్వహిస్తారు.

Also Read: Instagram : ఇన్‌స్టాగ్రామ్..టీనేజ్ యువతను ప్రమాదంలో పడేస్తుందా ? మెటా నివేదికల్లో సంచలన విషయాలు !!

రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడితే?

ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే సూపర్-8 పాయింట్ల పట్టిక ఆధారంగా ఫైనల్‌కు వెళ్లే జట్టును నిర్ణయిస్తారు. సూపర్-8 దశలో ఇంగ్లాండ్ తమ మూడు మ్యాచ్‌ల్లో గెలిచి 6 పాయింట్లతో ఉండగా టీమ్ ఇండియా కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. కాబట్టి రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగని పక్షంలో పాయింట్ల పట్టికలో ఎక్కువ పాయింట్లు ఉన్న ఇంగ్లాండ్ జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. భారత జట్టుకు శుభవార్త ఏంటంటే వర్షం కారణంగా మ్యాచ్‌కి ఎటువంటి అంతరాయం కలిగే అవకాశం లేదు. నేడు ముంబై వాతావరణం చాలా స్పష్టంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 28°C నుండి 31°C వరకు ఉండే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IND vs ENG
  • India vs England
  • Semi Final
  • sports news
  • T20 World Cup 2026

Related News

Pakistan

పాకిస్థాన్ క్రికెట్‌ జట్టులో కలకలం!

కోచ్ కఠినమైన వైఖరి, ఎవరినీ సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాలు డ్రెస్సింగ్ రూమ్‌లో అశాంతికి దారితీశాయని అంతర్గత వర్గాలు ఆరోపిస్తున్నాయి.

  • IND vs ENG

    ఇంగ్లాండ్‌తో భారత్ కీల‌క పోరు.. అభిషేక్ శ‌ర్మ‌కు నో ప్లేస్‌?!

  • Suryakumar Yadav, Gautam Gambhir

    ఇంగ్లండ్‌తో సెమీఫైన పై గంభీర్-సూర్య మైండ్ గేమ్..

  • India Vs England T20

    India vs England : వాంఖడే పిచ్ ఎవరికి కలిసొస్తుందో?

  • New Zealand

    టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. ఫైన‌ల్‌కు చేరిన తొలి జ‌ట్టు ఇదే!

Latest News

  • Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?

  • Etela Rajender : బిఆర్ఎస్ లోకి ఈటెల..? నిజమేనా ?

  • పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?

  • ServiceNow : దేశంలో కస్టమర్ సర్వీస్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను విడుదల చేసిన ‘సర్వీస్‌నౌ’

  • ASUS : విజయవాడలో ఆసుస్ (ASUS) తన సరికొత్త ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ ప్రారంభం

Trending News

    • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

    • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తుది వీడ్కోలు.. ఖ‌న‌నం ఎక్క‌డంటే?

    • రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇంకా ఎందుకు బయట ఉన్నాయి?

    • రేపే భార‌త్‌- ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఈ ఆట‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd