Indian Army On Virat Kohli: టెస్టులకు విరాట్ గుడ్ బై.. స్పందించిన భారత డీజీఎంఏ!
విరాట్ రిటైర్మెంట్ పై ప్రపంచవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత సైన్యంలోని ఒక సీనియర్ అధికారి కూడా విరాట్ రిటైర్మెంట్‌పై స్పందించారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య విరాట్ గురించి ఆయన ఒక పెద్ద వ్యాఖ్య చేశారు.
- By Gopichand Published Date - 04:31 PM, Mon - 12 May 25

Indian Army On Virat Kohli: క్రికెట్ అభిమానులకు మే 12 ఒక చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఈ రోజున విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. విరాట్ రిటైర్మెంట్ గురించి చర్చలు చాలా రోజులుగా జరుగుతున్నప్పటికీ.. ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ (Indian Army On Virat Kohli) ప్రకటనతో ఆ చర్చలకు తెరపడింది. విరాట్ రిటైర్మెంట్ పై ప్రపంచవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత సైన్యంలోని ఒక సీనియర్ అధికారి కూడా విరాట్ రిటైర్మెంట్‌పై స్పందించారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య విరాట్ గురించి ఆయన ఒక పెద్ద వ్యాఖ్య చేశారు.
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత అతని అభిమానుల్లో విచారం నెలకొంది. విరాట్ ప్రపంచంలోని అత్యుత్తమ టెస్ట్ ఆటగాళ్లలో ఒకడు. చాలా మంది అభిమానులు విరాట్ కోహ్లీని టెస్ట్ క్రికెట్ ఆడుతూ చూడాలని కోరుకున్నారు. అయితే ఇకపై అతను భారత్ తరపున తెల్ల జెర్సీలో కనిపించడు. విరాట్ రిటైర్మెంట్ తర్వాత భారత డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. “విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఈ రోజు క్రికెట్ గురించి మాట్లాడే రోజు కాదు. ప్రతి భారతీయుడిలాగే, అతను ఎప్పటికీ నా ఫేవరెట్” అని అన్నారు. భారత డీజీఎంఓ తన వ్యాఖ్యలతో విరాట్ రిటైర్మెంట్ పట్ల తాను కూడా విచారంలో ఉన్నట్లు స్పష్టం చేశారు.
Also Read: Rohit Sharma: వన్డే రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ!
విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో రిటైర్మెంట్ పోస్ట్
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఇలా రాశాడు. టెస్ట్ క్రికెట్‌లో వైట్ జెర్సీని నేను 14 సంవత్సరాల క్రితం ధరించాను. నిజాయితీగా చెప్పాలంటే ఈ ఫార్మాట్ నన్ను ఇంత ఎత్తుకు తీసుకెళ్తుందని నేను ఊహించలేదు. ఈ ఫార్మాట్ నన్ను పరీక్షించింది. నా కెరీర్‌ను నిలబెట్టింది. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనేక పాఠాలను నేర్పించింది. తెల్ల జెర్సీలో ఆడటం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకం. నిశ్శబ్దంగా కష్టపడటం, దీర్ఘమైన రోజులు, ఎవరూ చూడని చిన్న క్షణాలు, కానీ అవి ఎప్పటికీ మీతో ఉంటాయని కోహ్లీ పోస్ట్ చేశాడు.