HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli Reaction India Oval Test Win

Virat Kohli Reaction: టీమిండియాపై విరాట్ కోహ్లీ ప్ర‌శంస‌ల వ‌ర్షం.. ట్వీట్ వైర‌ల్‌!

టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ భారత్‌పై సిరీస్ విజయం కోసం ఎదురుచూపు మరోసారి పొడిగించబడింది. ఇంగ్లండ్ చివరిసారిగా 2018లో టీమ్ ఇండియాను టెస్ట్ సిరీస్‌లో ఓడించింది.

  • By Gopichand Published Date - 08:54 PM, Mon - 4 August 25
  • daily-hunt
Virat Kohli Reaction
Virat Kohli Reaction

Virat Kohli Reaction: లండన్‌లోని ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ అద్భుతమైన విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్‌ను, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టును మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli Reaction) మనస్ఫూర్తిగా అభినందించారు.

కోహ్లీ ట్వీట్

మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియాలో ఇలా ట్వీట్ చేశారు. టీమ్ ఇండియాకు అద్భుతమైన విజయం. ప్రసిద్ధ్, సిరాజ్ అద్భుతమైన ఓపిక‌, పట్టుదలను చూపించారు. వారి ప్రదర్శన ఆధారంగా జట్టు ఈ విజయాన్ని సాధించింది. నేను ప్రత్యేకంగా సిరాజ్ పేరును ప్రస్తావించాలనుకుంటున్నాను. అతను జట్టు కోసం తనను తాను పూర్తిగా అర్పించాడు. నేను అతని కోసం చాలా సంతోషిస్తున్నాను అని పేర్కొన్నాడు.

Also Read: Mohammed Siraj: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో 23 వికెట్ల‌తో స‌త్తా చాటిన సిరాజ్‌!

సిరాజ్ ప్రదర్శనతో మ్యాచ్ గమనం మారింది

ఐదవ రోజు ఆట ప్రారంభమైనప్పుడు ఇంగ్లండ్ విజయానికి కేవలం 35 పరుగులు మాత్రమే అవసరం. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో మహ్మద్ సిరాజ్ తన బౌలింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేసాడు. ముందుగా, జామీ స్మిత్‌ను పెవిలియన్‌కు పంపి, ఆ తర్వాత జామీ ఓవర్టన్‌ను 9 పరుగుల వద్ద ఔట్ చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ, జోష్ టంగ్‌ను బౌల్డ్ చేసి ఇంగ్లాండ్‌కు దెబ్బ కొట్టాడు. చివరికి సిరాజ్ వేసిన అద్భుతమైన యార్కర్‌కు గస్ ఆట్కిన్సన్ వికెట్ కోల్పోయాడు. దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికి, భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.

Great win by team india. Resilience and determination from Siraj and Prasidh has given us this phenomenal victory. Special mention to Siraj who will put everything on the line for the team. Extremely happy for him ❤️@mdsirajofficial @prasidh43

— Virat Kohli (@imVkohli) August 4, 2025

ఈ మ్యాచ్‌లో సిరాజ్ కీలక వికెట్లు తీసి, జట్టు ఓటమిని విజయంగా మార్చాడు. విరాట్ కోహ్లీ ప్రశంసలు సిరాజ్ అద్భుతమైన ప్రదర్శనకు దక్కిన గౌరవంగా చెప్పవచ్చు. యువ ఆటగాళ్ల పట్టుదల, పోరాటస్ఫూర్తితో భారత జట్టు ఈ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.

2018 నుంచి ఇంగ్లండ్ భారత్‌ను ఓడించలేకపోయింది

టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ భారత్‌పై సిరీస్ విజయం కోసం ఎదురుచూపు మరోసారి పొడిగించబడింది. ఇంగ్లండ్ చివరిసారిగా 2018లో టీమ్ ఇండియాను టెస్ట్ సిరీస్‌లో ఓడించింది. ఆ తర్వాత టీమ్ ఇండియా రెండుసార్లు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. రెండు సార్లు సిరీస్‌ను 2-2తో డ్రా చేయడంలో విజయవంతమైంది. అలాగే 2018 తర్వాత ఇంగ్లీష్ జట్టు రెండుసార్లు భారత్ పర్యటనకు వచ్చింది. రెండు సార్లు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IND vs ENG
  • Mohammed Siraj
  • Oval Test Win
  • sports news
  • virat kohli
  • Virat Kohli Reaction

Related News

IND vs SL

IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ టికెట్‌ను ఖరారు చేసుకుంది.

  • IND vs PAK Final

    IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

  • IND vs WI

    IND vs WI: జగదీసన్‌కు టెస్ట్ జట్టులో చోటు.. కిషన్‌కు మొండిచేయి!

  • Asia Cup Final 2025

    Asia Cup Final 2025: ఆసియా క‌ప్ ఫైన‌ల్‌లో భార‌త్‌తో త‌ల‌ప‌డే జ‌ట్టు ఇదేనా?

  • Shreyas Iyer

    Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ క్రికెట్ నుండి ఎందుకు విరామం తీసుకున్నాడు?

Latest News

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd