నెట్స్‌లో సందడి చేసిన విరాట్ కోహ్లీ.. అర్ష్‌దీప్ సింగ్‌ను అనుకరిస్తూ నవ్వులు పూయించిన కింగ్!
కోహ్లీ చేసిన ఈ అల్లరిని చూసి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పడి పడి నవ్వారు. రోహిత్ నవ్వుతో క్యాంప్‌లో మరింత ఉత్సాహం నెలకొంది.
- Author : Gopichand
Date : 10-01-2026 - 5:21 IST
Published By : Hashtagu Telugu Desk
Virat Kohli: న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియా సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలో వడోదరలో జరుగుతున్న నేషనల్ క్యాంప్‌కు భారత బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ చాలా ఉల్లాసంగా, మంచి జోష్‌లో హాజరయ్యారు. ప్రాక్టీస్ సెషన్ల మధ్య కోహ్లీ తన సహచర ఆటగాళ్లతో కలిసి సరదాగా గడుపుతూ టీమ్ వాతావరణాన్ని సందడిగా మార్చేశారు.
అర్ష్‌దీప్‌ను ఇమిటేట్ చేసిన విరాట్
నెట్ సెషన్‌లో విరాట్ కోహ్లీ కాసేపు ఎంటర్‌టైనర్‌గా మారిపోయారు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ చేయడానికి వస్తుండగా కోహ్లీ సరదాగా అతని రన్-అప్‌ను అనుకరించారు (మిమిక్రీ చేశారు). అర్ష్‌దీప్ వేసే అడుగులు, అతని బాడీ లాంగ్వేజ్‌ను కోహ్లీ కామిక్ స్టైల్‌లో చేసి చూపించడంతో అక్కడ ఉన్నవారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. కోహ్లీ చేసిన ఈ అల్లరితో ప్రాక్టీస్ సెషన్‌లోని సీరియస్‌నెస్ కాస్త తగ్గి, వాతావరణం తేలికపడింది.
Virat Kohli is mimicking Arshdeep Singh’s running style 😂❤️ pic.twitter.com/RbobLlmn5S
— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 9, 2026
నవ్వు ఆపుకోలేకపోయిన రోహిత్ శర్మ
కోహ్లీ చేసిన ఈ అల్లరిని చూసి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పడి పడి నవ్వారు. రోహిత్ నవ్వుతో క్యాంప్‌లో మరింత ఉత్సాహం నెలకొంది. వీరిద్దరూ ఒకరి కంపెనీని ఒకరు ఎంజాయ్ చేస్తూ చాలా రిలాక్స్‌డ్‌గా కనిపించారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!
అద్భుతమైన ఫామ్‌లో ‘కింగ్’ కోహ్లీ
విరాట్ కోహ్లీ ప్రస్తుతం కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ 3 మ్యాచ్‌ల్లో 151 సగటుతో 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆయన ఐసీసీ (ICC) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు.