CSK Dressing Room: అదంతా తప్పుడు ప్రచారమే కోహ్లీతో ధోనీ ఏమన్నాడో తెలుసా ?
కోహ్లీ చెన్నై డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి ధోనీని కలిసాడు. ఈ సందర్భంగా హగ్ చేసుకుని కీలక సూచనలు చేశాడు. విరాట్ నువ్వు ఫైనల్ కు చేరాలి, కప్ కొట్టాలి, గుడ్ లక్ అంటూ చెప్పాడు.
- By Praveen Aluthuru Published Date - 04:21 PM, Tue - 21 May 24

CSK Dressing Room: ఐపీఎల్ 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఈసారి నిరాశే మిగిలింది. ఆ జట్టు పోరాటం లీగ్ స్టేజ్ కే పరిమితమైంది. కెప్టెన్సీ మార్పు ప్రభావం చూపినట్టు పలువురు అంచనా వేస్తున్నారు. అన్నింటికీ మించి కీలకమైన చివరి మ్యాచ్ లో పోరాడినా ఫలితం దక్కలేదు. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ తీవ్ర నిరాశలో కనిపించాడు. మ్యాచ్ ను ముగించాలేకపోయానన్న బాధ అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఇదే బాధలో బెంగుళూరు ప్లేయర్స్ కు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదన్న వార్తలు వచ్చాయి. తన కెరీర్ లో క్రీడాస్ఫూర్తికి చిరునామాగా నిలిచిన ధోనీ ఇలా వ్యవహరించాడా అన్న అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇదంతా పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ ఏం చేశాడో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత గెలిచిన ఆనందంలో ఉన్న ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ గ్రౌండ్ లో వేరే హడావుడిలో ఉండడంతో ధోనీ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత కోహ్లీ చెన్నై డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి ధోనీని కలిసాడు. ఈ సందర్భంగా హగ్ చేసుకుని కీలక సూచనలు చేశాడు. విరాట్ నువ్వు ఫైనల్ కు చేరాలి, కప్ కొట్టాలి, గుడ్ లక్ అంటూ చెప్పాడు. ఈ విషయం కాస్త బయటకి రావడంతో, ఇది కాదా ధోని గొప్పతనం అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోయిన బాధలో ఉన్నప్పటికీ తన స్నేహితుడు కప్ గెలవాలని కోరుకున్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి వ్యక్తినా అందరూ నీచంగా విమర్శించారంటూ ధోనీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు వరల్డ్ క్రికెట్ లో క్రీడాస్ఫూర్తితో ఉండే ఆటగాళ్ల జాబితాలో మొదటి పేరు ధోనీదే ఉంటుందని, అలాంటి ధోనీ ప్రత్యర్థి ఆటగాళ్లను ఎందుకు అభినందించకుండా ఉంటాడంటూ గుర్తు చేస్తున్నారు.
Also Read: Prashant Kishore : బీజేపీకి సీట్లు అస్సలు తగ్గవు.. జగన్‌కు ఓటమి ఖాయం : పీకే