Virat Kohli: చరిత్ర సృష్టించిన కోహ్లీ
పూణెలోని ఎంసీఏ స్టేడియంలో భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2023 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన 17వ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ 77 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
- Author : Praveen Aluthuru
Date : 19-10-2023 - 10:06 IST
Published By : Hashtagu Telugu Desk
Virat Kohli: పూణెలోని ఎంసీఏ స్టేడియంలో భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2023 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన 17వ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ 77 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 26000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
సచిన్ టెండూల్కర్ మినహాఅంతర్జాతీయ క్రికెట్‌లో 26 వేల పరుగులను దాటిన ఆటగాళ్లు ఇద్దరే ఉన్నారు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 511 మ్యాచ్‌లు ఆడి 567 ఇన్నింగ్స్‌లలో 106 స్ట్రైక్ రేట్‌తో 26000 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ 26000 పరుగులు సాధించడానికి మొత్తం 601 ఇన్నింగ్స్‌లు పట్టింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్
1.సచిన్ టెండూల్కర్ – 664 మ్యాచ్‌లు – 34,357 పరుగులు
2. కుమార సంగక్కర – 594 మ్యాచ్‌లు – 28,016 పరుగులు
3. రికీ పాంటింగ్- 560 మ్యాచ్‌లు- 27,483 పరుగులు
4. విరాట్ కోహ్లీ- 511 మ్యాచ్‌లు- 26000* పరుగులు
5. మహేల జయవర్ధన్ – 652 మ్యాచ్‌లు – 25,957 పరుగులు
Also Read: World Cup 2023: బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయంVirat Kohli surpasses