టీ20 వరల్డ్ కప్.. టీమిండియాకు రెండు భారీ ఎదురుదెబ్బలు!
వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షిత్ రాణాకు ప్లేయింగ్ 11లో చోటు దక్కవచ్చు. రాణా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బంతి, బ్యాట్‌తో మంచి ప్రదర్శన చేశాడు.
- Author : Gopichand
Date : 20-01-2026 - 9:53 IST
Published By : Hashtagu Telugu Desk
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026కి ముందు టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోని ఇద్దరు స్టార్ ప్లేయర్లు గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో మ్యాచ్ విన్నర్ బ్యాటర్ తిలక్ వర్మ, స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్నవారే. ఇటీవల కాలంలో వీరిద్దరూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్లేయింగ్ 11ను ఎంపిక చేయడం టీమ్ ఇండియాకు సవాలుగా మారింది. ఒకవేళ వీరిద్దరూ టీ20 వరల్డ్ కప్ 2026కి దూరమైతే జట్టు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
తిలక్-సుందర్ లేకుండా టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది?
న్యూజిలాండ్‌తో జరిగే మొదటి మూడు టీ20 మ్యాచ్‌ల నుంచి తిలక్ వర్మ ప్రస్తుతం దూరమయ్యాడు. ఒకవేళ అతను సమయానికి కోలుకోకపోతే, టీ20 వరల్డ్ కప్ 2026 నుండి కూడా తప్పుకోవాల్సి రావచ్చు. ఇక వాషింగ్టన్ సుందర్ ఇప్పటికే పూర్తి టీ20 సిరీస్ నుండి తప్పుకున్నాడు. దీనివల్ల అతను కూడా వరల్డ్ కప్‌కు దూరం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. వీరిద్దరి గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్‌లకు కష్టాలు రెట్టింపు కానున్నాయి.
Also Read: మీ భర్త ప్రవర్తనలో ఈ మార్పులు గమనిస్తున్నారా?
వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షిత్ రాణాకు ప్లేయింగ్ 11లో చోటు దక్కవచ్చు. రాణా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బంతి, బ్యాట్‌తో మంచి ప్రదర్శన చేశాడు. మరోవైపు తిలక్ వర్మ స్థానంలో ఇషాన్ కిషన్‌కు ప్లేయింగ్ 11లోకి ఎంట్రీ లభించే అవకాశం ఉంది. కిషన్ ఐపీఎల్లో కూడా 3వ నంబర్లో బ్యాటింగ్ చేస్తూ మంచి రికార్డును కలిగి ఉన్నాడు. ఇక సంజూ శామ్సన్ ఓపెనర్‌గానే కొనసాగే అవకాశం ఉంది.
టీమ్ ఇండియా సంభావ్య ప్లేయింగ్ 11
అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.