Rohit Sharma Net Worth: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆదాయం ఎంతో తెలుసా..?
రోహిత్ శర్మ నికర విలువ (Rohit Sharma Net Worth) ఎంతో తెలుసా? రోహిత్ శర్మకు ముంబైలో విలాసవంతమైన ఇల్లు కాకుండా ఇంకా ఏమి ఉన్నాయో తెలుసా?
- By Gopichand Published Date - 07:38 PM, Tue - 8 August 23

Rohit Sharma Net Worth: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో పాటు, డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరఫున రోహిత్ శర్మ ఆడాడు. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే రోహిత్ శర్మ నికర విలువ (Rohit Sharma Net Worth) ఎంతో తెలుసా? రోహిత్ శర్మకు ముంబైలో విలాసవంతమైన ఇల్లు కాకుండా ఇంకా ఏమి ఉన్నాయో తెలుసా?
రోహిత్ శర్మ నికర విలువ..?
మీడియా కథనాల ప్రకారం.. రోహిత్ శర్మ నికర విలువ 214 కోట్లు. భారత కెప్టెన్‌కు ముంబైలో విలాసవంతమైన అపార్ట్మెంట్ ఉంది. ఈ విలాసవంతమైన అపార్ట్‌మెంట్ ఖరీదు దాదాపు 30 కోట్లు. ఇది కాకుండా రోహిత్ శర్మ వద్ద దాదాపు 6-7 కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి. రోహిత్ శర్మ అనేక కంపెనీలలో పెట్టుబడి పెట్టడమే కాకుండా, రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడి పెట్టాడు. అనేక బ్రాండ్‌లకు ప్రకటనలు ఇస్తున్నాడు. అయితే రోహిత్ శర్మతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఎక్కడ ఉన్నాడు? విరాట్ కోహ్లీ నికర విలువ ఎంత?
Also Read: 2023 World Cup: భారత్ ప్రపంచ కప్ గెలవలేదు…మాజీ ఆల్ రౌండర్ హాట్ కామెంట్స్
విరాట్ కోహ్లీ నికర విలువ ఎంత?
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే ఈ ఆటగాడి నికర విలువ దాదాపు 1050 కోట్లు. భారత జట్టుతో పాటు విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. కాగా, విరాట్ కోహ్లి సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ కోసం రూ.8.9 కోట్లు తీసుకుంటున్నాడు. విరాట్ కోహ్లీ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌కు రూ.2.5 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఈ విధంగా చూస్తే, సంపాదన పరంగా విరాట్ కోహ్లీ తన సహచర ఆటగాడు రోహిత్ శర్మ కంటే చాలా ముందున్నాడు.