Cricket Stadium: కోయంబత్తూరులో అతి పెద్ద క్రికెట్ స్టేడియం.. మాస్టర్ ప్లాన్ వేసిన తమిళనాడు ప్రభుత్వం..!
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం తర్వాత తమిళనాడులో ఇది రెండో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. స్టేడియం ప్రాంతంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడానికి ఇది ఒక చొరవ.
- By Gopichand Published Date - 02:00 PM, Sun - 11 August 24

Cricket Stadium: ప్రస్తుతం దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఉంది. అహ్మదాబాద్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం (Cricket Stadium) పేరు నరేంద్ర మోదీ స్టేడియం. ఈ స్టేడియంలో 1,32,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఇప్పుడు దీని కంటే పెద్ద క్రికెట్ స్టేడియం తమిళనాడులో నిర్మించబోతున్నారు. కోయంబత్తూరులో అతి పెద్ద స్టేడియం నిర్మించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం తర్వాత తమిళనాడులో ఇది రెండో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. స్టేడియం ప్రాంతంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడానికి ఇది ఒక చొరవ. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిఆర్‌బి రాజా, యువజన సంక్షేమం క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ ప్రాజెక్ట్‌లో ముందంజలో ఉన్నారు. తమిళనాడులో క్రీడలను ప్రోత్సహించడం, ప్రతిభను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తున్నారు.
Also Read: Nissan Magnite: బంపరాఫర్ ప్రకటించిన నిస్సాన్.. రూ. 1.53 లక్షల తగ్గింపు, కానీ వారే అర్హులు..!
కోయంబత్తూర్ నగరం నుండి NH 544లో 16 కి.మీ దూరంలో ఈ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ స్టేడియం ఉద్దేశ్యం భారతదేశంలోని అన్ని క్రికెట్ స్టేడియంల సామర్థ్యాన్ని అధిగమించడం. స్టేడియంలో VIP, కార్పొరేట్ సౌకర్యాలు, ఆటగాళ్ల లాంజ్, మీడియా సెంటర్, పబ్లిక్ కెఫెటేరియా, రెస్టారెంట్లు, క్రికెట్ మ్యూజియం వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ఈ స్టేడియాన్ని నిర్మించేందుకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం, బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం, లండన్‌లోని లార్డ్స్‌లను స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇక ఈ స్టేడియం నిర్మాణ పనులు ఎప్పుడు మొదలవుతాయి..? ఎప్పటికి పూర్తవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
ఎంఏ చిదంబరం స్టేడియం పాతబడిపోయింది
తమిళనాడులోని చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం చాలా పురాతనమైనదని మనకు తెలిసిందే. ఈ స్టేడియం 1916లో నిర్మించారు. మొదటి అంతర్జాతీయ మ్యాచ్ 1934లో ఇక్కడ జరిగింది. ఇది భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 202 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ స్టేడియంలో దాదాపు 50,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.