Nissan Magnite: బంపరాఫర్ ప్రకటించిన నిస్సాన్.. రూ. 1.53 లక్షల తగ్గింపు, కానీ వారే అర్హులు..!
- By Gopichand Published Date - 11:15 AM, Sun - 11 August 24

Nissan Magnite: నిస్సాన్ మోటార్ ఇండియా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUV మాగ్నైట్‌పై (Nissan Magnite) ఫ్రీడమ్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద మ్యాగ్నైట్‌పై రూ.1.53 లక్షల తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ సాధారణ కస్టమర్లకు కాదు. స్పెషల్ ఫ్రీడమ్ ఆఫర్ ప్రయోజనం రక్షణ సిబ్బందికి, దేశంలోని సెంట్రల్/స్టేట్ పోలీస్, సెంట్రల్ పారామిలిటరీ, స్టేట్ పోలీస్ ఫోర్స్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ తగ్గింపును CSD ద్వారా పొందవచ్చు.
నిస్సాన్ ఫ్రీడమ్ ఆఫర్ కింద.. ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కోసం మాగ్నైట్ బేస్ వేరియంట్ CSD ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షలు కాగా.. దాని టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 7.82 లక్షలు. ఈ డీల్‌తో అధికారులు సాధారణ ధరల శ్రేణితో పోలిస్తే రూ. 1.53 లక్షల ఆదా ప్రయోజనం పొందుతారు. రాష్ట్ర పోలీసు బలగాలు, కేంద్ర పారామిలిటరీ బలగాల్లో పనిచేస్తున్న వారికి మాగ్నైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.65. అయితే దీని టాప్ వేరియంట్ ధర రూ. 9.09 లక్షలు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిస్సాన్ అందిస్తున్న ఈ ఆఫర్ నిజంగా ప్రత్యేకం. ఈ ఆఫర్‌ను అందజేస్తూ మన దేశంలోని నిజమైన హీరోలను మేము గౌరవిస్తున్నామని, వారి కోసం మాగ్నైట్‌లో ఈ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చామని కంపెనీ తెలిపింది.
Also Read: Paris Olympics 2024 : ఏడు పతకాలు జస్ట్ మిస్.. ఆరు పతకాలతో సరిపెట్టుకున్న భారత్
ఇంజిన్- పవర్
ఇంజన్ గురించి మాట్లాడుకుంటే.. నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.0L, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 71 bhp శక్తిని, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా 99bhp శక్తిని, 160 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే మరో 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ AMT, CVT గేర్‌బాక్స్ సౌకర్యం ఉంటుంది.
- పొడవు: 3994 మిమీ
- వెడల్పు:1758mm
- ఎత్తు: 1572mm
- వీల్ బేస్: 2500mm
- గ్రౌండ్ క్లియరెన్స్: 205 మిమీ
- బూట్ స్పేస్: 336mm
- ఇంధన ట్యాంక్: 40 లీటర్లు
టాప్ ఫీచర్లు
- ఆటో-డిమ్మింగ్ IRVM
- వెంటిలేషన్ సీట్లు
- కొత్త డాష్‌బోర్డ్
- సాఫ్ట్-టచ్ డోర్ ప్యానెల్
- సింగిల్ పేన్ సన్‌రూఫ్
- 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
- వెదర్ కంట్రోల్
- నిస్సాన్ కనెక్ట్ టెలిమాటిక్స్
- యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ + EBD
- 2 ఎయిర్‌బ్యాగ్‌లు
- 4 స్టార్ భద్రత రేటింగ్
We’re now on WhatsApp. Click to Join.