HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >T20 World Cup 2024 Who Will Captain India

T20 World Cup: టీ20 ప్ర‌పంచ‌క‌ప్.. టీమిండియాకు కెప్టెన్‌గా కొత్త పేరు..?!

టీ20 ప్రపంచకప్ (T20 World Cup) 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. దీని కోసం ఏ దేశం కూడా ఇంకా జట్టును విడుదల చేయలేదు. ఈ క్ర‌మంలోనే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియాకు ఎవ‌రు కెప్టెన్‌గా వ్యవహరిస్తారనే సందేహం నెలకొంది.

  • Author : Gopichand Date : 27-01-2024 - 7:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Squad
India Victory

T20 World Cup: టీ20 ప్రపంచకప్ (T20 World Cup) 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. దీని కోసం ఏ దేశం కూడా ఇంకా జట్టును విడుదల చేయలేదు. ఈ క్ర‌మంలోనే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియాకు ఎవ‌రు కెప్టెన్‌గా వ్యవహరిస్తారనే సందేహం నెలకొంది. అయితే రోహిత్ శర్మ T20 ఇంటర్నేషనల్‌కు తిరిగి వచ్చాడు. కాబట్టి అతను భార‌త జ‌ట్టుకు మొదటి ఎంపిక. దీంతో పాటు గత ఏడాది కాలంగా టీ20 జట్టుకు నిరంతరం కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యాకు కూడా కెప్టెన్‌గా అవకాశం ద‌క్క‌వ‌చ్చ‌ని అంటున్నారు క్రీడా పండితులు.

ఇటీవలే రోహిత్ స్థానంలో ముంబై ఇండియన్స్ కమాండ్ కూడా హార్దిక్‌కే దక్కింది. అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ అనేక సందర్భాల్లో టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా కూడా కనిపించాడు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు కాకుండా మ‌రో ఆట‌గాడు కూడా పోటీకి వ‌స్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఆ నాలుగో పోటీదారు ఎవరు?

ప్రపంచకప్‌లో కెప్టెన్సీ కోసం ప్రధాన పోటీ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్యే ఉంది. అయితే సూర్యకుమార్ యాదవ్ బ్యాకప్ ఎంపికగా ఉండే అవ‌కాశాలే ఎక్కువ‌. అయితే గత కొంత కాలంగా కేఎల్ రాహుల్ వైట్ బాల్, రెడ్ బాల్ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. అంతేకాదు వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌గా కూడా నిరూపించుకున్నాడు. టీమిండియా టీ20 జట్టులో ప్రస్తుతం ఈ స్థానాన్ని ఎవ‌రు భర్తీ చేయలేక‌పోతున్నారు. ఇషాన్ కిషన్ అకస్మాత్తుగా విరామం తీసుకున్నాడు. జట్టులో సంజు శాంసన్, జితేష్ శర్మల స్థానం ధృవీకరించబడలేదు. ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిల్లో రాహుల్ T20 ప్రపంచ కప్ 2022 నుండి T20 ఇంటర్నేషనల్ ఆడలేదు. T20 ప్రపంచ కప్‌లో అతను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా చూడవచ్చు.

Also Read: Fastest Triple Century :147 బాల్స్‌లో ట్రిపుల్ సెంచ‌రీ.. హైదరాబాదీ క్రికెటర్ వరల్డ్ రికార్డ్

అంతేకాకుండా గత టీ20 ప్రపంచకప్‌లో రాహుల్ టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అనేక సందర్భాల్లో అతను వివిధ ఫార్మాట్లలో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ కారణంగా రాహుల్ టీ20లో కెప్టెన్సీకి కూడా పోటీదారుగా మారవచ్చని తెలుస్తోంది. కానీ రోహిత్, హార్దిక్ ఇద్దరూ లేకుంటేనే రాహుల్‌కు క‌మాండ్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ రాహుల్ టీ20 ప్రపంచకప్‌కు జట్టులో ఉంటే అప్పుడు టీమిండియా న‌లుగురు పటిష్టమైన కెప్టెన్సీ మెటీరియల్‌ని కలిగి ఉంటుందన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. IPL 2024 మార్చి చివరి నుండి మే చివరి వరకు నిర్వహించబడుతుంది. ప్రపంచకప్‌కు సంబంధించిన స్క్వాడ్ జట్లను మే 1 నాటికి విడుదల చేయనున్నారు. మే 20 వరకు ఇందులో మార్పులు ఉండవచ్చు. అంటే ఐపీఎల్ తొలి అర్ధభాగంలో ఆటగాళ్ల ప్రదర్శనతో టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టులో ఆట‌గాళ్లు చోటు దక్కించుకోవచ్చు. ఐపీఎల్ తేదీలు ఇంకా రాలేదు. తాత్కాలిక తేదీలు మార్చి 22 నుండి ఐపీఎల్ ప్రారంభం చేయొచ్చ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ తేదీ ఇంకా ధృవీకరించబడలేదు.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 T20 World Cup
  • Hardik Pandya
  • KL Rahul
  • rohit sharma
  • Suryakumar Yadav
  • T20 world cup
  • team india

Related News

BCCI Releases Team India 2026-27 Schedule

BCCI: టీమిండియా 2026-27 షెడ్యూల్‌ విడుదల

BCCI Releases Team India’s 2026-27 Schedule  భారత క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త అందించింది. 2026-27 సీజన్‌కు సంబంధించి టీమిండియా స్వదేశంలో ఆడనున్న అంతర్జాతీయ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది. ఈ సీజన్‌లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 17 నగరాల్లో 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున

    Latest News

    • Dog : రూ.5 బిస్కెట్ తో 130 కి.మీ పాదయాత్ర చేసిన శునకం..ఇది కదా విశ్వాసం అంటే !!

    • IPL: ఐపీఎల్‌ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్

    • Pawan Kalyan : నిహారిక – వరుణ్ తేజ్ లకు పవన్ సపోర్ట్ ..ఓపెనింగ్ తోనే హైప్ తెచ్చుకున్న ‘బరి’

    • Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

    • Rishab Shetty : ఆ నటులను ‘ఆన్ ఫాలో’ చేసిన రిషబ్ శెట్టి..కారణాలు ఏంటో ?

    Trending News

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd