Suryakumar Yadav: కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టిన సూర్యకుమార్ యాదవ్!
దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లోనే యూఏఈపై అద్భుతమైన విజయాన్ని సాధించింది
- Author : Gopichand
Date : 11-09-2025 - 7:10 IST
Published By : Hashtagu Telugu Desk
Suryakumar Yadav: దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నాయకత్వంలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లోనే యూఏఈపై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ అగ్రశ్రేణి ప్రదర్శన కనబరిచింది. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే అదరగొట్టగా, బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించారు.
సూర్యకుమార్ నాయకత్వ ప్రతిభ
ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ కెప్టెన్సీ చాలా అద్భుతంగా ఉంది. బౌలింగ్ మార్పుల నుంచి బ్యాటింగ్ ఆర్డర్‌లో తనను తాను ప్రమోట్ చేసుకోవడం వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు జట్టుకు బాగా కలిసి వచ్చాయి. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ కంటే సూర్యకుమార్ ఉత్తమ కెప్టెన్‌గా నిలిచాడని గణాంకాలు చెబుతున్నాయి.
టీ20లలో అత్యుత్తమ కెప్టెన్ సూర్య!
టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత టీమిండియా సారథ్యం సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించబడింది. అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కనీసం 10 టీ20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన భారత కెప్టెన్ల జాబితాలో సూర్యకుమార్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతని కెప్టెన్సీలో జట్టు విజయం సాధించిన శాతం 82.6.
ఈ విషయంలో రోహిత్ శర్మను కూడా సూర్యకుమార్ వెనక్కి నెట్టాడు. రోహిత్ నాయకత్వంలో జట్టు విజయాల శాతం 80.6 కాగా, కోహ్లీ మూడో స్థానంలో, హార్దిక్ పాండ్యా నాలుగో స్థానంలో ఉన్నారు.
Also Read: Sonia Gandhi: సోనియా గాంధీకి భారీ ఊరట.. పౌరసత్వం కేసు కొట్టివేత!
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ రికార్డు
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు 23 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 19 మ్యాచ్‌లలో విజయం సాధించగా, కేవలం 4 మ్యాచ్‌లలో మాత్రమే ఓడిపోయింది. సూర్య నాయకత్వంలో భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. అదేవిధంగా ఇంగ్లండ్‌ను స్వదేశంలో ఓడించడంలోనూ విజయం సాధించింది. ఆసియా కప్‌లో సూర్యకుమార్ తొలిసారిగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు.