Sikandar Raza: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్‌కు అగ్రస్థానం!
తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సికందర్ రజా 302 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 296 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నారు.
- By Gopichand Published Date - 02:43 PM, Wed - 3 September 25

Sikandar Raza: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా (Sikandar Raza) అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్ స్థానాన్ని భర్తీ చేస్తూ రజా ప్రపంచ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచారు.
సికందర్ రజా నంబర్ వన్
శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో సికందర్ రజా రెండు స్థానాలు ఎగబాకి నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచారు. ఈ సిరీస్‌లో రజా మొదటి వన్డేలో 92 పరుగులు, రెండవ వన్డేలో 55 బంతుల్లో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. బౌలింగ్‌లో కూడా ఆయన మంచి ప్రదర్శన కనబరిచారు. అయితే ఆయన అద్భుత ప్రదర్శన ఉన్నప్పటికీ జింబాబ్వే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-0తో కోల్పోయింది.
తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సికందర్ రజా 302 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 296 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ నబీ ఒక స్థానం దిగజారి 292 పాయింట్లతో మూడవ స్థానానికి చేరుకున్నారు. భారత ఆటగాళ్లలో కేవలం రవీంద్ర జడేజా మాత్రమే ఆల్‌రౌండర్ల జాబితాలో మొదటి 10 స్థానాల్లో ఉన్నారు. జడేజా 220 రేటింగ్ పాయింట్లతో తొమ్మిదవ స్థానంలో ఉన్నారు.
Also Read: Air India : ఎయిర్‌ఇండియా అదిరిపోయే ఆఫర్: బిజినెస్, ప్రీమియం ఎకానమీ టికెట్లపై భారీ డిస్కౌంట్లు
పాతుమ్ నిస్సాంకాకు కూడా లాభం
జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంకాకు కూడా లాభం చేకూరింది. నిస్సాంకా ఏడు స్థానాలు ఎగబాకి బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి చేరుకున్నారు. నిస్సాంకా మొదటి వన్డేలో 122 పరుగులు, రెండవ మ్యాచ్‌లో 76 పరుగులు సాధించారు.
కేశవ్ మహారాజ్ అగ్రస్థానం సుస్థిరం
ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ వన్డే క్రికెట్‌లో నంబర్ వన్ బౌలర్‌గా తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు. కేశవ్ 690 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రెండవ స్థానంలో ఉన్న మహేష్ తీక్షణ 659 పాయింట్లతో ఉన్నారు.