Iyer Copies Narine Bowling: నరైన్ ను కాపీ కొట్టిన శ్రేయాస్, గంభీర్ ఇంపాక్ట్
కెరీర్లో తొలిసారిగా బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు శ్రేయాస్ అయ్యర్. అతను బౌలింగ్ చేయడంతో షాక్ కు గురైన అభిమానులకు శ్రేయాస్ యాక్షన్ చూసి బిత్తరపోయారు. అతని యాక్షన్ సరిగ్గా సునీల్ నరైన్ లాగా ఉండటంతో ప్రతిఒక్కరు అయ్యర్ యాక్షన్ బౌలింగ్ చూసి ఆశ్చర్యపోయారు. అయ్యర్ బౌలింగ్ చేసేటప్పుడు రన్నింగ్ మరియు బంతి వదిలేటప్పుడు యాక్షన్ చూస్తే ప్రతి ఒక్కరికి సునీల్ నరైన్ గుర్తుకు వచ్చాడు
- Author : Praveen Aluthuru
Date : 28-08-2024 - 3:46 IST
Published By : Hashtagu Telugu Desk
Iyer Copies Narine Bowling: బుచ్చి బాబు టోర్నీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిన్న ముంబై, తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ చేసిన పని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ సమయంలో అయ్యర్ అకస్మాత్తుగా సునీల్ నరైన్ అవతారంలోకి మారాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ చేయడం ప్రతిఒక్కరిని షాకింగ్ కు గురి చేసింది.
అయ్యర్ బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి. అతను బౌలింగ్ చేయడంతో షాక్ కు గురైన అభిమానులకు శ్రేయాస్ యాక్షన్ చూసి బిత్తరపోయారు. అతని యాక్షన్ సరిగ్గా సునీల్ నరైన్ లాగా ఉండటంతో ప్రతిఒక్కరు అయ్యర్ యాక్షన్ బౌలింగ్ చూసి ఆశ్చర్యపోయారు. అయ్యర్ బౌలింగ్ చేసేటప్పుడు రన్నింగ్ మరియు బంతి వదిలేటప్పుడు యాక్షన్ చూస్తే ప్రతి ఒక్కరికి సునీల్ నరైన్ గుర్తుకు వచ్చాడు. తొలిరోజు ఆట ముగిసే సమయంలో అయ్యర్ చివరి ఓవర్ వేశాడు. మొదటి 5 బంతుల్లో ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ సోను యాదవ్ చివరి బంతికి సిక్స్ కొట్టాడు. తద్వారా అతని ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది.
Shreyas Iyer bowling with Sunil Narine action 😭😭 pic.twitter.com/Ah0omGDxgE
— Yash Godara #ICT (@105of70Mumbai) August 27, 2024
నరైన్ తరహాలో అయ్యర్ బౌలింగ్‌ను చూసి క్రికెట్ అభిమానులు ఆనందించారు. ఇక గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్ అయినప్పటి నుంచి టీమిండియా ఆటగాళ్లను ఆల్ రౌండర్లుగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రోహిత్, రింకు సింగ్, సూర్య కుమార్ యాదవ్ లాంటి బ్యాటర్లతోనూ గంభీర్ బౌలింగ్ చేయించాడు. ఇప్పుడు అయ్యర్ తొలిసారి బంతితోనూ ఆకట్టుకున్నాడు.కాగా సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ ప్రారంభం కానుంది. ఇందులో శ్రేయాస్ అయ్యర్ టీమ్ డి కెప్టెన్‌గా కనిపించనున్నాడు.
Also Read: MLC Kavitha : కవిత లాయర్లకు ఆ పత్రాలివ్వండి.. సీబీఐకు ట్రయల్ కోర్టు ఆదేశాలు