MLC Kavitha : కవిత లాయర్లకు ఆ పత్రాలివ్వండి.. సీబీఐకు ట్రయల్ కోర్టు ఆదేశాలు
ఈసందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. కవిత(MLC Kavitha) తరఫు న్యాయవాదులు కోరుతున్న పత్రాలను సెప్టెంబరు 4లోగా ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది.
- By Pasha Published Date - 03:35 PM, Wed - 28 August 24

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన సీబీఐ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ మధ్యాహ్నం విచారణ జరిగింది. ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఈసందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. కవిత(MLC Kavitha) తరఫు న్యాయవాదులు కోరుతున్న పత్రాలను సెప్టెంబరు 4లోగా ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది.
We’re now on WhatsApp. Click to Join
సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కొన్ని పత్రాలు సరిగ్గా లేవంటూ కవిత తరఫు లాయర్లు వినిపించిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ఆయా పత్రాలను కవిత తరఫు లాయర్లకు అందించాలని సీబీఐకి సూచించింది. సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణను సెప్టెంబరు 11కు వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ విచారణ ముగిసిన వెంటనే కల్వకుంట్ల కవిత ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.
Also Read :SSC Jobs : వేలాది కానిస్టేబుల్ జాబ్స్.. ఎస్ఎస్‌సీ భారీ నోటిఫికేషన్
- 2024 మార్చిలో కవిత అరెస్ట్ అయ్యారు. ఆగష్టు 26వరకు ఆమెకు బెయిల్ రాలేదు.
- లోక్‌సభ ఎన్నికల తర్వాత కవితకు బెయిల్ వచ్చేస్తుందంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది.
- ఈక్రమంలోనే తొలుత ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక నిందితుడు, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చింది.
- ఆ వెంటనే కవితకు కూడా బెయిల్ వస్తుందనే టాక్ మొదలైంది.
- మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను విచారించే క్రమంలో సీబీఐ, ఈడీల స్పందనను సుప్రీంకోర్టు కోరింది.
- కవిత బెయిల్ పిటిషన్‌ను విచారించే క్రమంలోనూ సీబీఐ, ఈడీల స్పందనను సుప్రీంకోర్టు కోరింది. దీంతో తప్పకుండా కవితకు కూడా బెయిల్ ఇస్తారనే ప్రచారానికి బలం లభించింది.
- ఈ అంచనాలకు అనుగుణంగానే కవితకు ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది.