HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Sanju Samson To Csk Shami Arjun Tendulkar To Lucknow Ipls Biggest Trade

Sanju Samson : CSKలోకి సంజు శాంసన్..లక్నోకి షమీ, అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ బిగ్గెస్ట్ ట్రేడ్ !

  • By Vamsi Chowdary Korata Published Date - 11:40 AM, Sat - 15 November 25
  • daily-hunt
Sanju Samson Csk
Sanju Samson Csk

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు భారీ ట్రేడ్ డీల్స్ పూర్తయ్యాయి. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి సీఎస్కేకు, రవీంద్ర జడేజా సీఎస్కే నుంచి రాజస్థాన్‌కు మారారు. అర్జున్ టెండుల్కర్ లక్నోకు, మహ్మద్ షమీ సన్‌రైజర్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీకి వెళ్లాడు. మయాంక్ మార్కండే ముంబైకి, నితీష్ రాణా ఢిల్లీకి చేరాడు. సామ్ కరన్ రాయల్స్‌లో కీలక ఆటగాడిగా మారాడు. అయితే ఈ డీల్‌లో రూ. 4 కోట్ల తక్కువ ధరకు జడ్డూ ఆర్‌ఆర్‌కి వెళ్లాల్సి వచ్చింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులను టెన్షన్ పెట్టిన బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ ఎట్టకేలకు కంప్లీట్ అయింది. ఎప్పుడో పూర్తవ్వాల్సిన సంజు శాంసన్ – రవీంద్ర జడేజా ట్రేడ్ డీల్ ఐపీఎల్ 2026 రిటెన్షన్ గడువు రోజున ముగిసింది. ఇకపై చెన్నై చిన్న తలా సీఎస్కేలో ఆడడు.. అలాగే రాజస్థాన్ సైలెంట్ కింగ్ సంజు శాంసన్ పింక్ జెర్సీలో కనిపించడు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది.

సీఎస్కే – రాజస్థాన్ స్వాప్ డీల్‌తో రవీంద్ర జడేజా పారితోషకంలో మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో సీఎస్కే జడేజాని రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకున్నప్పటికీ.. ఇప్పుడు రాజస్థాన్ మాత్రం కేవలం రూ. 14 కోట్లే చెల్లించనుంది. మరోవైపు సంజు శాంసన్ మాత్రం తన ప్రస్తుత రూ.18 కోట్ల ఫీజుతోనే సీఎస్కేకు మారాడు. 177 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన శాంసన్ 2022లో రాయల్స్‌ను ఫైనల్స్‌కి తీసుకెళ్లిన కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

మిగతా జట్ల ట్రేడ్ కూడా పూర్తయింది. ముంబై ఇండియన్స్‌కు గత సీజన్లలో ప్రాతినిధ్యం వహించిన అర్జున్ టెండుల్కర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టులోకి తీసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా ఈ మార్పుల్లో భాగమై, రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆడనున్నాడు.

ఇతర ట్రేడ్ మార్పుల్లోనూ కీలక మార్పులు కనిపించాయి. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మయాంక్ మార్కండే ఇకపై ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నాడు. అలాగే, రాజస్థాన్ రాయల్స్ నుంచి నితీష్ రాణాను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడ్ ద్వారా దక్కించుకుంది. ఈ మార్పులు ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జట్ల కాంబినేషన్లలో భారీ మార్పులను సూచిస్తున్నాయి.

సామ్ కరన్ కూడా రాయల్స్‌కు కీలక బలంగా మారనున్నాడు. 64 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ పంజాబ్ కింగ్స్, సీఎస్‌కే జట్లలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ట్రేడ్‌తో రాయల్స్‌లో చేరాడు, అతన్ని రూ.2.4 కోట్ల ఫీజుతోనే రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • CSK
  • IPL 2026
  • IPL 2026 Retention
  • ravindra jadeja
  • Sanju Samson
  • Sanju Samson CSK

Related News

Virat Kohli

Virat Kohli: వైజాగ్‌లో విరాట్ కోహ్లీ క్రేజ్‌..పెరిగిన టికెట్ల అమ్మకాలు!!

భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడవ వన్డే మ్యాచ్ డిసెంబర్ 6న వైజాగ్‌లో జరగనుంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దీనికి సంబంధించిన ఒక నివేదికలో విశాఖపట్నంలో జరగబోయే వన్డే కోసం మొదట టికెట్లు అమ్ముడుపోలేదని, అయితే విరాట్ కోహ్లీ సెంచరీ తర్వాత టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయని తెలిపింది.

  • IPL Auction

    IPL Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. విదేశీ ఆటగాళ్లకు కొత్త నియమం!

  • RCB

    RCB: ఆర్సీబీ జ‌ట్టును కొనుగోలు చేయ‌బోయేది ఇత‌నేనా?!

  • Smriti Mandhana

    Smriti Mandhana: డిసెంబ‌ర్ 7న‌ స్మృతి, పలాష్‌ల పెళ్లి.. అస‌లు నిజం ఇదే!

  • Robin Smith

    Robin Smith: ఇంగ్లాండ్ క్రికెట్‌కు బ్యాడ్ న్యూస్‌.. మాజీ క్రికెట‌ర్ క‌న్నుమూత‌!

Latest News

  • Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్ అయిందా? ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకుండానే!

  • Nail Rubbing: మీకు ఈ అలవాటు ఉందా? రోజుకు 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు!!

  • Putin Dinner: పుతిన్ విందుపై రాజకీయ దుమారం.. ఆ విష‌యంపై కాంగ్రెస్ అభ్యంతరం!

  • Putin Travel Cars: పుతిన్ ప్రయాణించిన కార్లు.. ఆరస్ సెనాట్- ఆర్మర్డ్ ఫార్చ్యూనర్, ఏది ఎక్కువ శక్తివంతమైనది?

  • Sabrimala Temple: శ‌బరిమల ఆలయంలో భక్తులపై దాడి!

Trending News

    • Financial Crisis: మీ అరచేతిలో భాగ్య రేఖ.. ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉంటుంది?

    • 14 Reels : అప్పుల ఊబిలో అఖండ నిర్మాతలు.. మెడకు చుట్టుకున్న ఆ 90 కోట్లు!

    • Virat Kohli Records: వైజాగ్‌లో రేపే నిర్ణయాత్మక పోరు.. కోహ్లీని ఊరిస్తున్న 3 భారీ రికార్డులీవే!

    • Akhanda 2 New Release Date : ఈరోజు రాత్రికే ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు!

    • Putin India Visit: మోదీ-పుతిన్ ఒకే కారులో ఎందుకు కూర్చున్నారో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd