Sanju Samson: తొలిసారి సీఎస్కే జెర్సీలో కనిపించిన సంజు శాంసన్!
సీఎస్కే జట్టు ఇప్పుడు ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం సన్నాహాలు ప్రారంభించింది.
- By Gopichand Published Date - 02:22 PM, Thu - 20 November 25
Sanju Samson: సీఎస్కే జట్టు ఇప్పుడు ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఆ వేలానికి ముందే సీఎస్కే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ (Sanju Samson)ను తమ జట్టులో చేర్చుకుంది. శాంసన్ జట్టులో చేరిన తర్వాత ఫ్రాంఛైజీ ఒక వీడియోను షేర్ చేసింది. అందులో సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ ధరించి కనిపిస్తున్నాడు. దీంతో పాటుగా మరో పోస్ట్ కూడా వచ్చింది. అందులో సంజు శాంసన్ జట్టులో చేరిన తర్వాత తన అనుభవాన్ని పంచుకున్నాడు. తాను చాలా కాలంగా ఎదురుచూసిన సమయం ముగిసిందని ఆయన చెప్పాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరినందుకు సంజు శాంసన్ సంతోషం
వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ సీఎస్కే జట్టులో చేరిన తర్వాత ఇలా అన్నాడు. “నేను ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. నేను పసుపు రంగు జెర్సీని ధరించబోతున్నందుకు చాలా అదృష్టవంతుడిని. నేను ఎప్పుడూ నలుపు, నీలం, గోధుమ రంగు వంటి ముదురు రంగు దుస్తులు ధరించేవాడిని. కానీ పసుపు రంగును ఎప్పుడూ ధరించలేదు. ఈ జెర్సీని ధరించడం ఒక అద్భుతమైన అనుభూతి. సీఎస్కే జెర్సీ ధరించాక ఎలా ఫీల్ అవుతానో నేను ఎప్పుడూ ఊహించలేదు. చాలా పాజిటివ్‌గా అనిపిస్తోంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ జెర్సీని ధరించిన తర్వాత ఒక ప్రత్యేకమైన భావన వస్తోంది. నేను ఛాంపియన్‌గా భావిస్తున్నాను” అని పేర్కొన్నాడు.
Also Read: Sajjanar Warning : ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు – సజ్జనార్
సంజు శాంసన్ రాకతో సీఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమైంది అనడంలో సందేహం లేదు. 177 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 4,704 పరుగులు, 3 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు చేసిన రికార్డుతో శాంసన్ అపారమైన అనుభవాన్ని తనతో పాటు తెస్తున్నాడు. అంతేకాకుండా అతను రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుకు చాలా సీజన్ల పాటు విజయవంతంగా కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉండటం, ధోని తర్వాత నాయకత్వ వారసత్వం కోసం సీఎస్కే చేస్తున్న అన్వేషణకు బలమైన పరిష్కారాన్ని చూపింది.
"Felt like a champion.” – Sanju
In Yellove, the spirit chooses you 💛 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/Eh4S0G5Am9— Chennai Super Kings (@ChennaiIPL) November 19, 2025