RR vs MI: ముంబై చేతిలో రాజస్థాన్ ఘోర ఓటమి.. టోర్నీ నుంచి రాయల్స్ ఔట్!
ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
- By Gopichand Published Date - 11:26 PM, Thu - 1 May 25

RR vs MI: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ (RR vs MI) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయి ఘోర ఓటమిని నమోదు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ముంబై జట్లు పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి చేరుకోగా.. రాజస్థాన్ జట్టు టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించింది.
ముంబై భారీ స్కోర్
ఇకపోతే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్లు నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగులు సాధించింది. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ (53), రికెల్టన్ (61) పరుగులతో జట్టుకు మంచి ఓపెనింగ్ ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 116 పరుగులు సాధించారు. అయితే రికెల్టన్, రోహిత్ శర్మ ఔట్ అయిన తర్వాత కెప్టెన్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ చెరో 48 పరుగులతో రాజస్థాన్ బౌలర్లపై విరుచుపడ్డారు. దీంతో ముంబై జట్లు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది.
Also Read: Pakistan In Panic: భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. సైన్యాన్ని మోహరిస్తున్న పాక్!
కుప్పకూలిన రాజస్థాన్
218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ.. ముంబై మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. రాజస్థాన్ బ్యాటింగ్‌లో ఏ బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రాజస్థాన్ బ్యాటింగ్‌లో ఆర్చర్ 30 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలింగ్‌లో బౌల్ట్, కరణ్ శర్మ చెరో మూడు వికెట్లు తీయగా.. బుమ్రా రెండు వికెట్లు, దీపక్ చాహర్, పాండ్యా చెరో 1 వికెట్ తీశారు.