Pakistan In Panic: భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. సైన్యాన్ని మోహరిస్తున్న పాక్!
భారత్- పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈ సమయంలో పాకిస్తాన్ సరిహద్దు వద్ద తన సైన్యాల సంఖ్యను పెంచుతోంది. పాకిస్తాన్ సరిహద్దు వద్ద రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు, చైనీస్ హోవిట్జర్ ఫిరంగులను మోహరించింది.
- By Gopichand Published Date - 10:46 PM, Thu - 1 May 25

Pakistan In Panic: భారత్- పాకిస్తాన్ (Pakistan In Panic) మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈ సమయంలో పాకిస్తాన్ సరిహద్దు వద్ద తన సైన్యాల సంఖ్యను పెంచుతోంది. పాకిస్తాన్ సరిహద్దు వద్ద రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు, చైనీస్ హోవిట్జర్ ఫిరంగులను మోహరించింది. వార్తా సంస్థ ఏఎన్‌ఐ నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ సైన్యం రాజస్థాన్‌లోని బార్మర్‌లోని లోంగేవాలా సెక్టార్‌కు ఎదురుగా రాడార్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను మోహరించింది.
పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ మూడు పెద్ద సైనిక విన్యాసాలు
నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ ప్రస్తుతం మూడు పెద్ద సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది. తద్వారా అన్ని ఆస్తులను అప్రమత్త స్థితిలో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విన్యాసాలకు ఫిజా-ఎ-బద్ర్, లాల్కర్-ఎ-మోమిన్, జర్బ్-ఎ-హైదరీ అని పేర్లు పెట్టారు. ఇందులో F-16, J-10, JF-17 వంటి అన్ని ప్రధాన ఫైటర్ జెట్‌ల ఫ్లీట్‌లను చేర్చారు. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ సైన్యం స్ట్రైక్ కోర్‌తో కలిసి ఈ విన్యాసాలను నిర్వహిస్తోంది.
ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఫోర్స్ మోహరణ
పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య లాహోర్, కరాచీపై తన వైమానిక రంగాన్ని తాత్కాలికంగా మూసివేసింది. పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఫోర్స్‌ను ఎయిర్‌ఫీల్డ్, గ్రౌండ్ డిఫెన్స్ బేస్‌ల రక్షణ కోసం మోహరించింది. ఇటీవల భారత నావికాదళం అరేబియా సముద్రంలో అనేక యుద్ధనౌకలతో లాంగ్ రేంజ్ ఫైరింగ్ విన్యాసం నిర్వహించింది. దీంతో పాకిస్తాన్ నావికాదళం కూడా భయపడింది.
Also Read: Mukesh Ambani : ముఖేష్ అంబానీ ఇంట విషాదం
భారత చర్యలతో భయపడిన అసీమ్ మునీర్
పాకిస్తాన్ ప్రభుత్వ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్ ప్రకారం.. పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసీమ్ మునీర్ గురువారం (మే 1, 2025) భారత దాడులకు సమాధానం ఇస్తామని చెప్పారు. భారత చర్యలతో భయపడిన అసీమ్ మునీర్ “పాకిస్తాన్ ప్రాంతీయ శాంతికి కట్టుబడి ఉంది. కానీ జాతీయ ఆసక్తుల రక్షణ కోసం మా సన్నాహాలు పూర్తయ్యాయి” అని అన్నారు. పాకిస్తాన్ మంత్రి బుధవారం (ఏప్రిల్ 30, 2025) భారత చర్యల ఆందోళనతో రాబోయే 36 గంటలు కీలకమని చెప్పారు.
గతంలో పాకిస్తాన్ భారత విమానాల కోసం తన వైమానిక రంగాన్ని మూసివేసింది. ఇప్పుడు భారత్ కూడా ప్రతీకారంగా పాకిస్తాన్ విమానాల కోసం తన వైమానిక రంగాన్ని మూసివేసింది. ఈ సమయంలో పాకిస్తాన్‌లో నమోదైన, నిర్వహించబడిన లేదా లీజ్‌పై ఉన్న విమానాలతో పాటు పాకిస్తాన్ సైనిక విమానాలకు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదు.