HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rr Vs Csk Rr 106 2 10 Suryavanshi Smashes 15 Ball Fifty

సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. అతను 2023లో కోల్‌కతాపై 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.

  • Author : Gopichand Date : 30-03-2026 - 10:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Suryavanshi
Suryavanshi

Suryavanshi: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ శివతాండవం చేసింది. ఐపీఎల్ 2026లో తాను ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఈ సీజన్ మొత్తం తన బ్యాటింగ్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అతను స్పష్టం చేశాడు. కేవలం 15 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ చరిత్రలో ఇది రెండో అత్యంత వేగవంతమైన అర్ధశతకం. 305 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన సూర్యవంశీ మొత్తం 17 బంతుల్లో 52 పరుగులు చేసి చెన్నైపై మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు.

సూర్యవంశీ చారిత్రాత్మక ఇన్నింగ్స్

ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026ని కూడా అదే జోరుతో ప్రారంభించాడు. చెన్నై బౌలర్లపై మొదటి ఓవర్ నుంచే విరుచుకుపడి పరుగుల వరద పారించాడు. అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో అవుట్ అయినప్పటికీ అప్పటికే రాజస్థాన్ జట్టును గెలుపు ముంగిట నిలిపాడు.

Also Read: పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

Flair on display 🔥

Vaibhav Sooryavanshi in the house 😎

Updates ▶️ https://t.co/UzbuFk5G26#TATAIPL | #KhelBindaas | #RRvCSK pic.twitter.com/dr0hYVaVij

— IndianPremierLeague (@IPL) March 30, 2026

రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. అతను 2023లో కోల్‌కతాపై 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు వైభవ్ చేసిన ఈ 15 బంతుల అర్ధశతకం ఈ జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. మూడవ స్థానంలో కూడా వైభవ్ పేరే ఉండటం విశేషం. 2025లో గుజరాత్‌పై అతను 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

కేవలం 127 పరుగులకే కుప్పకూలిన CSK

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. కేవలం 19 పరుగులకే ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వికెట్ల పతనం కొనసాగింది. ఒక దశలో 82 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సీఎస్కే తరపున జేమీ ఓవర్టన్ అత్యధికంగా 36 బంతుల్లో 43 పరుగులు చేశాడు. చివరికి చెన్నై జట్టు 19.4 ఓవర్లలో కేవలం 127 పరుగులకే ఆలౌట్ అయింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, జడేజా తలో 2 వికెట్లు తీశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • Fifty
  • IPL 2026
  • RR vs CSK
  • sports news
  • Suryavanshi

Related News

Rajasthan Royals

ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

ఐపీఎల్ 2026 మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాజస్థాన్ జట్టులో ఈ విజయానికి వైభవ్ సూర్యవంశీ హీరోగా నిలిచారు.

  • Chinnaswamy Stadium

    చిన్నస్వామి స్టేడియంలో దొంగల బీభత్సం!

  • IPL 2026

    కేకేఆర్ ఫ్యాన్‌కు ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ప్రపోజ్!

  • Rohit Sharma

    ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. క్యాప్డ్ ప్లేయర్ అంటే ఏమిటి?!

  • Cameron Green

    రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

Latest News

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

  • జనాభా గణన.. 33 ప్రశ్నలు సిద్ధం!!

Trending News

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd