HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rohit Vs Virat In Ranji Trophy

Rohit vs Virat: రంజీలో రోహిత్ వర్సెస్ విరాట్!

విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 155 మ్యాచ్‌ల్లో 48.23 సగటుతో 11479 పరుగులు చేశాడు.

  • Author : Naresh Kumar Date : 24-01-2025 - 8:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kohli- Rohi
Kohli- Rohi

Rohit vs Virat: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి టీమిండియాను భారీగా దెబ్బ తీసింది. అంతకుముందు కివీ జట్టు విషయంలోనే ఇదే జరిగింది. న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై వైట్ వాష్ అయి భారత్ పరువు పోగొట్టుకుంది. ఈ రెండు టెస్టుల్లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విఫలమయ్యారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్, కోహ్లీ (Rohit vs Virat) తమ స్థాయిని మర్చిపోయి ఆడినట్లు కనిపించింది. దీంతో వాళ్ళ రీటైర్మెంట్ పై వార్తలు వెల్లువెత్తాయి. మాజీలు సైతం వీళ్ళిద్దర్నీ టెస్ట్ ఫార్మేట్ కు వీడ్కోలు పలకాలని సూచించారు. అయితే భవిష్యత్తు క్రికెట్ బాగుండాలంటే రోహిత్ కోహ్లీని టెస్టుల్లో ఆడించాలని బీసీసీఐ భావిస్తుంది.

రోహిత్, కోహ్లీ ఇప్పటికే టి20లకు రిటైర్మెంట్ ఇవ్వడంతో టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇస్తే కీలక టోర్నీలలో వాళ్ళకి ప్రాక్టీస్ ఇబ్బంది అవుతుందని బీసీసీఐ భావిస్తుంది. ఈ నేపథ్యంలో రోహిత్ కోహ్లీలను దేశవాళీ టోర్నీలలో ఆడించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 128 మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను 49.39 సగటుతో 9827 పరుగులు చేశాడు.ఇందులో 29 సెంచరీలు మరియు 38 హాఫ్ సెంచరీలు సాధించాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో అతని ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంది. అతను 336 మ్యాచ్‌ల్లో 46.81 సగటుతో 13108 పరుగులు చేశాడు.

Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రపంచ ఛాంపియన్ జట్టు తంటాలు

విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 155 మ్యాచ్‌ల్లో 48.23 సగటుతో 11479 పరుగులు చేశాడు. ఇందులో 37 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. లిస్ట్ ఎ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 329 మ్యాచ్‌ల్లో 57.05 సగటుతో 15348 పరుగులు చేశాడు. కాగా దుబాయ్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియాకు సవాలుగా మారింది. ఈ ట్రోఫీని పాక్ నిర్వహిస్తుండగా భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి. ఈ టోర్నీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై టీమిండియా భారీ అంచనాలు పెట్టుకుంది. రోహిత్, కోహ్లీకి చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన అనుభవం ఎక్కువగా ఉండటంతో గంభీర్ కూడా రోకో విషయంలో పటిష్ట ప్రణాళికలు రచిస్తున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Domestic Cricket
  • Ranji Trophy
  • rohit sharma
  • sports news
  • virat kohli

Related News

Rohit Sharma breaks silence on retirement: 'I am not leaving...'

Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

లార్డ్స్‌లో తన 34వ వన్డే సెంచరీతో రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్ వదంతులను తోసిపుచ్చారు, 2027 ప్రపంచ కప్ గెలవడంపైనే తన దృష్టిని ఉందని పునరుద్ఘాటించారు. ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన వన్డేకు ముందు తనను వెంటాడిన రిటైర్మెంట్ గుసగుసలకు రోహిత్ శర్మ ఒక చమత్కారమైన సమాధానం సిద్ధం చేసుకున్నారు: “గోల లేకపోతే సరదా ఉండదు”. ఈ మ్యాచ్‌తో అతని వన్డే కెరీర్ ముగియవచ్చని వార్తలు వస్తున్

  • BCCI refutes reports regarding Rohit Sharma's retirement.

    Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలను ఖండించిన బీసీసీఐ

  • Rohit Sharma's retirement...?

    Rohit Sharma: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌..? ఇంగ్లాండ్‌తో చివరి వన్డే

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd