Rohit Sharma: రోహిత్ ఫామ్‌పై విమర్శలు.. రూ. 16.30 కోట్లు వృథానేనా?
వరుసగా రెండు మ్యాచ్‌లలో విఫలమైన తర్వాత రోహిత్ శర్మపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత 10 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో రోహిత్ పరుగుల కోసం కష్టడాల్సి వస్తోంది.
- By Gopichand Published Date - 03:35 PM, Sun - 30 March 25

Rohit Sharma: ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ (Rohit Sharma) అభిమానులను చాలా నిరాశపరిచాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో అతని బ్యాటింగ్ “ఆయే రామ్ గయే రామ్” లాగా ఉంది. రోహిత్ క్రీజ్‌కు వచ్చి మొదటి ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఎలాగోలా రెండు ఫోర్లు కొట్టి ఖాతా తెరిచాడు. కానీ అదే ఓవర్‌లో వికెట్ కోల్పోయాడు. దీని ప్రభావం ఏమిటంటే.. జట్టు రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది.
రోహిత్‌పై ప్రశ్నలు?
వరుసగా రెండు మ్యాచ్‌లలో విఫలమైన తర్వాత రోహిత్ శర్మపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత 10 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో రోహిత్ పరుగుల కోసం కష్టడాల్సి వస్తోంది. అతని గణాంకాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025కి ముందు రోహిత్ శర్మను 16.30 కోట్ల రూపాయలకు రిటైన్ చేసింది. కానీ రోహిత్ ఫామ్ ఇప్పుడు జట్టుకు చింతకరమైన అంశంగా మారుతోంది.
ఐపీఎల్ 2025లో రోహిత్ ప్రదర్శన
- మొదటి మ్యాచ్: 4 బంతులు ఆడి సున్నాకి ఔట్.
- రెండవ మ్యాచ్: 4 బంతుల్లో 8 పరుగులు చేసి ఔట్.
గత 10 ఇన్నింగ్స్‌ల దారుణ రికార్డు
గత ఐపీఎల్ 10 ఇన్నింగ్స్‌లలో రోహిత్ గణాంకాలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అతను 10 ఇన్నింగ్స్‌లలో 154 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక అర్ధ శతకం ఉంది. రోహిత్ 6 సార్లు డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయాడు. అతను కేవలం 2 సార్లు మాత్రమే 30+ పరుగులు సాధించాడు.
కెరీర్ గణాంకాలు అద్భుతం.., కానీ ఇటీవలి ఫామ్ చాలా దారుణం
రోహిత్ శర్మ ఈ లీగ్‌లో ఒక లెజెండ్. అతను ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 6636 పరుగులు సాధించాడు. అందులో 2 శతకాలు, 43 అర్ధశతకాలు ఉన్నాయి. కానీ అతని ఇటీవలి ప్రదర్శన అతని స్థాయికి, ప్రతిభకు తగినట్లుగా లేదు. ఇప్పుడు అభిమానులు హిట్‌మ్యాన్ త్వరలోనే ఫామ్‌లోకి వచ్చి ముంబై ఇండియన్స్‌కు ఆరో టైటిల్ అందించేందుకు కృషి చేస్తాడని ఆశిస్తున్నారు.